పుట:Andhrula Charitramu Part 2.pdf/191

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వ్రాయంబడిన యీ యనుమకొండశాసనములోనే రుద్రదేవునియెడ గల భీతిచేత మరణము నొందె నని చెప్పబడియెను. కాబట్టి ప్రోలరాజునే జయింపబడినట్టియు రుద్రదేవునిచే జంపబడినట్టియు దైలపదేవుడు పశ్చిమచాళుక్యచక్రవర్తియైన మూడవతైలపదేవుడు కాడనుట స్పష్టము. ఈ తైలపదేవుడు ఛాళుక్యచక్రవర్తు లకు సేనాధిపతియై బనవాసిమండలమున కధిపతి యైన తైలపదేవుడై యుండు నని కొందఱు తలంచుచున్నారు గాని పై శ్లోకమునందు తైలపదేవుడు చాళుక్య చూడామణి యని పేర్కొనంబడి యుండుటచేతను సేనాపతియైన తైలపదేవుడు కదంబరాయడగుటచేతను వారిజాడ మంతగా విశ్వసింపదగినదిగా గనుపట్టదు. ఇతడు తప్పక చాళుక్యచక్రవర్తులకు సమీపబంధువై సామంతమాండలికు డైనవాడుగ నుండవలయును. ఇయ్యది భావిపరిశోధనమునం దేటపడవచ్చును.1

                          ప్రోలరాజ్ గోవిందరాజును జయించుట
      ప్రోలరాజు శ్చిమచాళుక్యచక్రవర్తుల సేనాధిపతి యైన గోవిందరాజును జయించెనని  యనుమకొండలోని రుద్రదేవునిశాసనములోనే యీ క్రింది శ్లోకమున జెప్పబడినది.

    "యోకుకోరిపతేరకుంకారశు శ్లక్ష్ణాగ్ర్ర ధారోల్లన
     ద్ధారాపాత నిపాతనైశ చతురం గోవిందరాజాహ్వయం
     బర్ద్వోమ్మచ్య తదోదయక్షితిభృతే రాజ్యం దదౌ లీలయా
     లుంధాకో విద్షయస్య తస్య సమరే సద్వీందీక్షాగురు:."

    ఇందు బేర్కొనబడిన గోవిందరాజు గణపతిదేవచక్రవర్తి గణపేశ్వరశాసనమునందు  గోవిందదంజీళు డని వక్కాణింపబడియెను. ఇతడు  పశ్చిమచాళుక్యచక్రవర్తి యగు యాఱవవిక్రమాదిత్యుని సేనాధిపతి యైన

1. ఈ శైలదేవుడు త్రిభ్వనమల్లునికుమారుడనియు, అతనిశాసనమునం దొకదానిలో ప్రోలరాజు జయించెనని చెప్పబడి యున్నదనియు, అతడు రాజ్యాధిపత్యమును వహింప లేదనియు గొందఱు చెప్పుచున్నారు.