పుట:Andhrula Charitramu Part 2.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వర్ణింపబడియె ననియు, నేను పేర్కొనిన గురుమల్లికార్జున పండితారాధ్యుడు గృహస్థుడు కుమారసంభవ కృతిపతి కాజాలడనియు, ఆ జంగమ మల్లికార్జునుడు కాలాముఖి మఠశాసనములో నుగ్గడింపబడెననియు, అతని పేర కుంభకోణములో నొక మఠము కట్టబడినదనియు, అతడు నన్నయభట్టారకునకు బూర్వపువాడనియు, శ్రీయుత మానవల్లి రామకృష్ణకవి ఎం.ఏ., గారు వాదించుచున్నారు. మరియు కుమారసంభవములో

“శా|| భర్గుండంతక వాహనుల్శరహతిన్ భంజించునట్లెమ్మెయిన్
దర్గంగా రథపత్రముల్ విరిగ వేదండాంకురానీకముల్
నుర్గాడన్ భటకోరకంబు లలరన్ నూత్నాశ్వపుష్పౌహఘముల్
మర్గింతున్ బరసైన్యపద్మవనముం మద్బాణవర్షంబునన్"

అను పద్యములో "తర్గంగా, నుర్గాడన్, మర్గింతున్” అని భారతములో లేని ప్రయోగములవంటి ప్రయోగములు గలవనియు,
"క్రౌంచపద వృత్తము :-
చంచుల నాస్వాదించుచు లేదూండ్ల కరువు ప్రియలకు నలరుచు మైరో మాంచలములొలింగంచుకితంబై వొడమగ నడరుచు బులినమూలం