పుట:Andhrula Charitramu Part 2.pdf/184

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తెగలోని నామమాత్రక్షత్రియులుగాని క్షత్రియజాత్యుచిత యజ్ఞాపనీతాదిచిహ్నములు ధరియించి వేదాధ్యయన వైదికకర్మాచరణాదు లొనరించు నార్యక్షత్రియులుగా గనుపట్టరు. దుర్జయకులస్థులు తాము విష్ణుపారోద్భవులనియు జతుర్ధాన్వయులమనియు దమ తమ శాసనములయందు స్పష్టముగ జెప్పుకొనియున్నారు. కాకతీయులును దుర్జయవంశజులని గణపతి దేవచక్రవర్తికాలమునాటి శాసనములందు జెప్ప బడి యుండుటంజేసి వీరును విష్ణుపాదోద్భవులనియూ జరుర్ధాన్వయులనియు నూహింపవలసివచుచున్నది. ఈ యూహనుఇ బలపఱచునట్టి సహేతుకములైన ప్రబలుప్రమాణము లనేకములు చూపట్టుచున్నవి. విష్ణూఅదసంభవుల మనియు జతుర్ధాన్వయులమనియును జెప్పుకొన్న కమ్మనాటిరాజుల (కమ్మవారి)తో సంబంధబాంధవ్యములు నెఱపి యుండిరి. కాకతీయమ హాదేవరాజు పుత్త్రికయు, గణఫతిదేవచక్రవర్తి తోబుట్టువు నగు మేళాంబిక యను మైలమ్మను, చతుర్ధచంశసంజాతుడును నతవాటివిషయాధీశ్వరుండు నగు బుద్ధ రాజుకొడుకు శ్రీమన్మహామండలేశ్వరరుద్రదేవరాజున కిచ్చి వివాహము చేయబడియెను.1 ఈమహామండలేశ్వర రుద్రదేవరాజుకొమర్తయగు బయ్యమాంబ యను బయ్యలమహాదేవిని చరుర్ధ వంశసంభూతుడును, ధనంజయగోత్రుడును, శ్రీధాన్యవతీపురీధీశ్వరుండును, రెండవ భీమరాజూత్రుడును మహామండ లేశ్వరుడు నగు కేతరాజునకిచ్చి వివాహము చేయబడియెను.2 మఱియు నీ కేతరాజుతల్లి యైన సబ్బమదేవి చతుర్ధాన్వయసంభవు డయిన వెలనాటి వీర రాజేంద్రచోడరాజ పుత్రికయు, మూడవగొంకరాజునకు దోబుట్టువు నై యుండెను.3 ఈ సబ్బమదేవితండ్రి యైన వెలనాటి రాజేంద్రచోడమహారాజు బుద్ధ వర్మవంశోద్ధారకుండును, దుర్జయకులాభరణుడును, చతుర్ధాన్వయసంజాతుడు నగు కొండ


1. The Annual Report on Epigrahy for 1905, No.204: Epigraphica Indica Vol.Vi. p. 159, line 8. 2.Ibid. Inscription of Bayyamamba. 3. Ibid. Vol. VIII, page 148.