పుట:Andhrula Charitramu Part 2.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చక్రవర్తుల సామ్రాజ్యాంతము వరకును గల చరిత్రము మాత్రమే వ్రాయబడినది.

పరస్పర విరుద్ధాంశములు

ఈ చరిత్రము రెండేండ్ల నుండి వ్రాయబడుచు వ్రాసిన భాగమెప్పటిదప్పుడు ముద్రింపబడుచు వచ్చుటచేత నొక కాలమునం దెలియని విషయములు మరియొక కాలమునం దెలిసికొనుట తటస్థించుట చేత నట్టి విషయములు కడపటి ప్రకరణములలో జేర్పబడుచువచ్చినవి. అట్టి సందర్భములయందు గడపటి ప్రకరణములలోని విషయములే ప్రామాణ్యములుగా నంగీకరింపదగినవని చదువరులకు మనవి చేయుచున్నాడను.

నన్నెచోడ కవి రాజశిఖామణి

నన్నెచోడ కవిరాజశిఖామణి కాలము నేను నిర్ణయించినదే సరియైనదని చెప్పజాలను. శ్రీబుర్రా శేషగిరిరావు పంతులు ఎం.ఏ., గారు పండ్రెడవ శతాబ్దము మధ్య నున్న త్రిభువనమల్ల చోడదేవుని చోడబల్లినిగా భావించి యతని జ్యేష్ఠపుత్రుడైన నన్నెచోడుడే నన్నెచోడకవియని సిద్ధాంతము చేసినారు కాని త్రిభువనమల్లుడు చోడబల్లి కాజాలడు. అదియునుగాక త్రిభువనమల్లుని కొడుకైన నన్నెచోడుని తల్లి మాబలదేవి యని శాసనములం గన్పట్టుచున్నది. కుమారసంభవమున దన తల్లి శ్రీసతియని నన్నెచోడకవి చెప్పుకొనియున్నాడు. కుమారసంభవ కృతపతియైన జంగమ మల్లికార్జునుడు బ్రహ్మచారిగా