Jump to content

పుట:Andhrula Charitramu Part 2.pdf/176

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఈసుందరి మాపుత్రిక యాటచే నీవెంట కొనిపోవువారికి దుర్గతులు గల్గుట సత్యము" అని గొల్లున గోలపెట్టిరి. అంతట నెఱుకుదేవరాజు బ్రాహ్మణులంగని యిట్లనియెను. "బ్రాహ్మణులారా"! ఈమ క్షత్రియకాంత యని వారు చెప్పుచున్నారు; ఈమె యంగ సౌష్టవమును గాంచినప్పుడు నాకుగూడ నట్లే తోచుచున్నది" అని చెప్పగా వారలు దోషమును జెంది యీమెను గొనిపోయిన యెడల మేమందఱమును పుత్రమత్త్రకళత్ర బంధు వర్గంతోడ ననలప్రవేశమున్ గాంచి ముక్తి జెందెదము. మాకీర్తి త్రైలోక్యంబునందును వ్యాపించును. ఈబ్రహ్మహత్యల పాపమును మూటకట్టుకొనుటకై బల్లహుడు వచ్చినవాడు గనుక నతని వంశంబును సాంరాజ్యంబును గూలిపోవు నని శపింప నుద్యుక్తులు కాగా బల్లహుని మంత్రి విని గడగడ వడంకుచు వచ్చి వారలతో నిట్లనియె. "అయ్యా! బ్రాహ్మణశ్రేష్టులారా! ఇది యేమి సాహసము? మీయిష్ట మైనరీతిని వర్తింతముగాక; ఈమాధవశర్మ మహిమాఢ్యుడు: ఇతని వంటివా రీధాత్రిలో గానరారు; మెము వ్యర్ధముగా నీమె రాజపత్ని యని రవ్వచేసినమాట వాస్తవము; ఇప్పుడు మీపంతము చెల్లెను మీరు సంతోషముతో నుండవ్లసినది: అయిన నొక్కపరీక్ష చేయవలసియున్నది; మీరు సిద్దేశ్వరుని సమ్ముఖమునకు బోయి యచట నామె చేతియన్నమును భుజింపవలయును: ఆమె యెవ్వరైనను జంపు నుద్దేశ్యము మాకులేదు; ఆమె మాధవశర్మ కొమర్తెయైన మాకు చింతయే లేదు. ఒకవేళ నామె రాజపత్నియే యైన యెడల కామె గర్భమున నున్న శిశువును రక్షించి కందారంబునను బట్టాభిషేకము గావింతుము. మీకెల్లరకు నగ్రహారములిప్పింతుము" అని చెప్పనంతట విప్రవరులు తమకు ధన కనక వస్తు వాహనాదులతో నిమిత్తము లేదనియును, బల్లహునిమంత్రి కోరినప్రకారము సిద్దేశ్వరుని సమ్ముఖంబున తమకొమార్తె వడ్డించిన యన్న మును భుజించుటకు దమ కేయభ్యంతరమును లెదనియున్, గర్భవతి యన్నమును భుజింపరాదని శాస్త్రము చెప్పుచున్నది గనుక నట్లు బ్రాహ్మణులు లాచరింపరాదనియును జెప్పి యితని నొప్పించి తుదకు వారు సిద్దేశ్వరుని ముంగట గటక