పుట:Andhrula Charitramu Part 2.pdf/171

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

'నాగడు గార్గెయుడు ' ననువార లిరువురు నాదేశమును 126 సంవత్సరములు పరిపాలనము చేసిరని స్థానిక చరిత్రమ్న జెప్పబడినది. ఈ కిరాతకుల పరిపాలన ముననే జైన్ల నేలు లిచ్చటికివచ్చి నివాసములు కుదుర్చుకొనిరి. పద్మాక్షీ దేవాలయమున్న కొండపై జైనశిలావిగ్రహముల నెలకొల్పిరి సిద్ధులకు పార్వతీపర మేశ్వరులు ప్రత్యక్ష మైనస్థలము గనుక సిద్దాశ్రమంబని ప్రసిద్ధిగాంచిన యాశైవక్షేత్రమును జైనక్షెత్రమున మార్చిరని చెప్పబడినదిగాని, దీనిని విశ్వసింప రాదు. మొట్టమొదట నీప్రదేశము జైనక్షెత్రముగనే యుండి తరువాత శైవక్షెత్రముగ మార్చబడినటుల గాకతిప్రోలరాజుశాసనముంబట్టి దెలియుచున్నది.1

                           సోమదేవరాజు.
     ఈకిరాతకులకు బిమ్మట జంద్రవంశపు రాజు లీయనుమకొండ రాజ్యమును బరిపాలించినటుల జెప్పబడినది. చంద్రవంశమున బాండవులు జనించిరి. వారి వంశమున జనమేజయుడు జనించెను.  అతనివంశమున విజయార్కుడు, సోమేంద్రుడునను నిరువురు భూపాలురు పుట్టిరి.  వారిలో విదయార్కునకు విష్ణువర్ధనుడును, సోమేశ్వరుడునకు ఉత్తుంగభుజుడున్ జనియించిరి.  వీర లుభయులును దేశమును విభాగించుకొని పరిపాలించిరి  విష్ణువర్ధనుడు గోదావరికి దక్షిణమున నున్న ధర్మపురిని రాజధానిగ జేసికొని యనేకరాజులను జయించి రాజరాజబిరుదుండని కీర్తిప్రతిష్టలను గాంచెను.  విష్ణువర్ధనునకు నందు డనుకుమారుడు పుట్టి నందగిరి అను దుర్గము నొకదాని నిర్మించి దానిని రాజధానిగ జేసికొని భూపరిపాలనము చేసెను.  దీనికి సూరయాదిత్యుడు ప్రధాని గానుండి రాజనీతులన్ దెలుపుచుండెను.  నందుని భార్య భానుమతీదేవి.  ఇతడు రాజ్యభారమ మంతయును మంత్రివరునకు నొప్పగించి శ్రీశైలక్షేత్రమునకు బోయి శ్రీమల్లికార్జుమ్నదేవున్మి సేవించి సిద్దోపదేశమును బొంది యొకబిలములో ప్రవేశించెను.  అచ్చట తపస్సుచేయుచుండిన యొక యోగిని వాని ధైర్యసాహసమ్లకు మెచ్చి వానికి ఖడ్గఖేటుక

 1. Epigraphia Indica. Vol.IX Page 256