పుట:Andhrula Charitramu Part 2.pdf/170

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

టర పరిపాలన సంవత్సరమున వర్షఋతువులోని యెనిమిదవపక్షమున దశమి నాడు మహాకాండూరుగ్రామనివాసియును కమ్మక రాకవిషయమున వడరూరు గ్రామవాసి యగు నాగచంద్రునియొక్క కుమారుడును, ఆవేశనియు నగు సిద్ధారెధుడు తనతల్లి నాగలానితోడను, తనభార్య సముద్రాణితోడను, కుమారుడు మూలశ్రీతోడను, కుమారిక నాగబంధునిక తోడను, సోదరుడు బుద్దనికునితోడను, వానిభార్యతోడను, సిద్దార్ధినియొక్క కొమారితతోడను, వేటగిరి గ్రామమునం దుండిన రక్తబంధువులతోడను, మిత్త్రులతొడను, గలిసి బుద్ధుని చైత్యముయొక్క ప్రాగ్ద్వారము సామీప్యమున ప్రాణికోటియొక్క క్షేమము నిమిత్తము ఆయక్తస్తంభముల నైదింటిని నియమించి దానముచేసెనని చెప్పబడి యున్నది.1 ఈ శాసనమునందు బేర్కొనంబడిన యిక్ష్వాకువీరుడైన శ్రీపురుషదత్తుడు ఆంధ్రచక్రవర్తి యైనమూడవపులమావి యనంతర మీదేశ మాక్రమించుకొని పరిపాలించిన పల్లవరాజని యూహింపవచ్చును.

                  అనుమకొండ నామోత్పత్తి వివరణము
     ప్రాచీనకాలంబున శ్రీశైలప్రాంతారణ్యప్రదేశంబుల మహాశూరుడై స్వేచ్చావిహారేము సలుపుచుండిన కిరాతకు డొకండు తన యనుచరులతో గూడి యచటికి నిరువది యోజనములదూరమౌన గృష్టాగోదావరీమధ్యప్రదేశమున హిడింబాశ్రమం బని ప్రఖ్యాతిగాంచిన ముదిగొండను నీశానభాగమున గ్రోశత్రయ దూరంబున నుండెని హనుమాద్రికడకు నేతెంచి యచట నొకగ్రామమును విస్తరించి నివసించుచుండెను.  అటుపిమ్మట హనుమాద్రిపైనొకదుర్గమును నిర్మాణముచేసి గ్రామమును విస్తరింపజేసి 'ఎఱుకుదేవరాజు ' అనుపేరితో బ్రజాపాలనము సేయుచుండెను. అతనికి 'అనుమడు, కొండడు,'అను నిరువురు కొడుకులు జనించిరి. ఆయిరువుర పేరిట నారాజధానీనగరమునకు 'అనుమకొండ ' అను నభిదానం గలిగినది. అనుమకొండకు దక్షిణమున నాలుగుసర్వుల దూరమున కొండడు తనపేరిట గొండపర్తి యనుగ్రామమును గట్టించెనట! ఎఱుక దేవరాజు పిమ్మట వానికొడుకు లిరువురును, తరువాత

1.Burgess Amaravaty & Jaggayyapeta Stupas P.11