పుట:Andhrula Charitramu Part 2.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

త్రాంశములను వెల్వరించవచ్చును. అట్లగుటవలన సమగ్రమయినట్టియు, సప్రమాణమైనట్టియు దేశచరిత్రము వ్రాయుటకెవ్వనికి సాధ్యమగును? నాయాంధ్రులచరిత్రము సమగ్రమయినదని నేనెప్పుడును చెప్పియుండలేదు. నేనపేక్షించున దెల్ల జరిత్రజ్ఞులగువారు నా గ్రంథమును జదివి గుణదోష పరిశీలనము చేసి యనురాగముతో నాకు దెలిపి సుకరమైన మార్గమును జూపితోడ్పడవలసియుననియె.

భాగవివరణము

ఈ ద్వితీయ భాగమునందు కొండవీటి పంటరెడ్ల చరిత్రమును గూడ జేర్చుటకు మొదట సంకల్పించింనవాడనైనను, విజ్ఞాన చంద్రికా మండలివారు ద్వితీయ భాగము 400 పుటలకన్నా మించి యుండరాదని శాసించియున్నందున, కాకతీయ చరిత్రము ముగించునప్పటికే 324 పుటలు నిండి యుపోద్ఘాతాదులతో 400 పుటలగుచున్నందున, పంటరెడ్ల చరిత్రమునిందు జేర్చుటకు సాధ్యపడకపోయినది. అదియునుంగాక పంటరెడ్లచరిత్రము విస్తరించి వ్రాయవలసియున్నది కావున దానిని మూడవ భాగములో జేర్చి సాధ్యమయినంత శీఘ్రకాలములో ననగా 5, 6 మాసములలోనే ముద్రింప బ్రయత్నించెదను. కాబట్టి యీ భాగమునందు క్రీ.శ.1100 సంవత్సరము మొదలుకొని క్రీ.శ.1350 వ సంవత్సరమునకు అనగా కాకతీయ