పుట:Andhrula Charitramu Part 2.pdf/162

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రాజధానీనగరంబులను దహించుటయె యొక ఘనకార్యముగా దలపోయు చుండిరి. అప్పటి యచారమునుబట్టి చక్రకోట్యమండలాధిపతి యైనసోమేశ్వరుడు వేంగీదేశముపై దండెత్తివచ్చి వేంగీపురమును దహించినట్లు మిక్కిలి డంబముగా దిన కృష్ణపురశాసనమున్ందు జెప్పుకొనియున్నాడు.1 అయినను వేంగీరాజ్య మును బరిపాలించిన మహారాజులు సయితము చక్రకూట రాజధానిని దహించి నట్లుగా దమశాసనములందు జెప్పుకొనియే యున్నారు. ఇట్లాండొరుల రాజధానులను దగులంబెట్టుట సత్యమే కావచ్చును. ఈ సోమేశ్వరునికాలమున మొదటికులోత్తుంగ ఛోడచక్రవర్తికుమారుడైన్ వీర చోడమహారాజు తండ్రికి బ్రతినిధి గానుండి వేంగీరాష్ట్రమును బరిపాలనము సేయుచుండెను.ఇతనినామముకూడ సోమేశ్వర్ని శాసనమునం దుదాహరింపబడినది. వేంగీపుర మనునది ప్రాచీన వేంగీపురముకాదు. ఆకాలమునందు వేంగీపురమునకు రాజధానిగనుండిన రాజమహేంద్రపురమే వేంగీపురముగాక బరరాష్ట్రాధిపతులచే బేర్కొనంబడుచుండె నని తోచుచున్నది. కాబట్టి వేంగీరాష్ట్రాధిపరు లైన చాళుక్యచోడులకును, చక్రకొట్య మండలాధిపతులయిన నాగరాజులకును బలుమాఱు యుద్ధములు జరుగుచుండె ననుట వాస్తవము. ఇతడు వేంగీపురమును మాత్రమేగాక వజ్రపురప్తాంతదేశ్వమునందలి యరణ్యముల నన్నిటిని దహింపించె నని చెప్పుబడియెను. మఱియ్యును దక్షిణకోసలముపై దండేత్తిపోయి ఆఱులక్షల తోంబదియాఱు గ్రామమ్లను గైకొనియె నని సోమేశ్వరునిశాసనమున వ్రాయ బడినది. ఇది వట్టి యతిశయోక్తిగాన వేఱొండుగాదు. దక్షిణకోసలమునం దన్ని గ్రామములు కలవా యని సందేహింపవలసి యున్నది. ఒకవేళ నిజ మనుకొన్నను సోమేశ్వరుడు నిజముగా దక్షిణకోసలమును బరిపాలించె నను మాటను సమర్ధించుటకు సప్రమాణ మైన యాధార మేమియును గానరాదు. ఇతడు దక్షిణకోసలదేశముపై దండెత్తిపోయి తిరిగి వెడలగొట్టబడువఱకు గొంతభాగ మాక్రమించుకొని యుండవచ్చును. ఇయ్యది జజళ్లదేవునిశాసనమునుబట్టి యూహింపబడుచున్నది. జజళ్ల


1. Eqigraphia Indica Vo X. No.4