పుట:Andhrula Charitramu Part 2.pdf/161

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సోమేశ్వరదేవుడు వాలిని జయించి యుద్ధరంగమున జంపి సింహాసనమెక్కి నటుల సోమేశ్వరుని కృష్ణపుర (Kuruspal) శాసనమునుబట్టి దెలియుచున్నది. ఇతడు వింధ్యవాసినీ దేవతయొక్క యనుగ్రహముచేత జన కీచక్రకూట సామ్రాజ్యము లభించెనని తనశాసనమునందు జెప్పికొనియుండుటకూడ నీతనికి బూర్వ మీ రాజ్యము మధురాంతకదెఏవునిదే నాక్తమింపబడి పరిపాలింపబదు చుండె నని చూచనగ దెలుపుచున్నది. ఇతని కృష్ణపురశాసనములలో నొక దానియందు సంకాలికులగు రాజుల పేరు లెన్నియో పేర్కొనబడినవి గాని, యాభాగ మంతయు శిధిలమైయుండుటచేత నంతగాప్రయోజనకారి గాక యున్నది. నారాయణపురము (Naraanapal) శాసనమునందుంబోలె నీకృష్ణ పురశాసనమునందును నాగరాజుల బిరుదావళి పేర్కొనబడియున్నది గాని యంతకన్న విశేషాంశం లేవియు గానరావు. తక్కిన శాసనములందుంబోలె నీశాసనమునందును సోమేశ్వరుడు నాగవంశరాజు డనియు, కశ్వపగోత్రు డనియు బేర్కొనబడియెను. మఱీయును మహారాధిరాజ పరమభట్టారక పరమ మఃహేశ్వర సోమేశ్వరదేవుడని వక్కాణింపబడియుండుటచేత నాగరాజులలో నితడు మిక్కిలి పరాక్రమవంతుడయిన స్వతంత్రరాజని వేద్య మగుచున్నది.

                      మొదటిసోమేశ్వరుని విజయయాత్రలు.
    రెండవధారావర్షునికొడు కగు నితడే చక్రకొట్యమండలమును బాలించిన సోమేశ్వరనాము లయిన నాగరాజులలో మొదటివాడుగ నున్నవాడ్. ఇతడు విజృంభించిన శత్రురారాజమండలిపై గవిసి వారల రాదధాను లగు కళింగనగరము, లంజిపురము, రత్నపురము, లవణపురి, వేంగీనగరము, భద్రపట్టణం, వజ్రపురము, మొదలగువానిని ముట్టడించి జయించినట్లుగ దెలియు చున్నది.  నారాయణుడు మధురాక్షసుని నిర్జించినవిధముగా మొదట సోమేశ్వరుడు మధురాంతీదేవుని సంహరించి పిన్ననరాయణు డన్న బిరుదనామ మునువహించి యటుపిమ్మట శత్రువర్గమువైపునకు దరిగెను. ఆకాలమునందు భూపరిపాలనముచేయురాజులు మొదలగువారు మత్సగ్రస్తులై యెండొరుల