పుట:Andhrula Charitramu Part 2.pdf/160

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ననియు దనశాసనమునందు జెప్పుకొనియున్నాడు. భ్రమరకోట్యమండల మనునది చక్రకొట్యమండలములో నొకభాగముయొక్క నామమో, లేక చక్రకొట్య మండలమునకు నామాంతరమో భోధపడలేదు. ధారావర్షుడు చక్రకొట్యమండల మును బరిపాలించుచుందగా నామండలనే మధురాంతకదేవుడు స్వతంత్రుడై పరి పాలనము సేయుచుండెననుట విశ్వాసాఅత్రము గాదు. ధారావర్షునకు మధురాంతక దేవుడు సామంతు డనియే యూహింపవలసి యున్నది. అయినను భావిపరిశోధనమువలననే యీవిషయ మిదత్ద మని నిర్ణయింప వలయును.

      మధురాంతక దేవుడు శా. శ 987 సరియగు ప్రభవసంవత్సర కార్తికిశుద్ధ బుధవాసరానూరాధాంక్షత్రయుక్త శుభలగ్నమునందు కన్నరదేవ రాజకుమారుని యొక్కయు, పట్టమహిషి నాగలమహాదేవియొక్కయు, నాయక కుమారుని యొక్కయు,శూద్రకనాయకునియొక్కయు, తుంగరాజకుమారునియొక్కయు, పుల్లమసెట్టియొక్కయు సమ్మతినిగైకొని మేడిపాత్రు డను బ్రాహ్మణునకు భ్రమర కాట్యమండలములోని రాజపురగ్రామమును ధారాపూర్ఫకముగ దానముచేసెను. ఈరాజశాసనము నతిక్రమించి యీదానమునకు భంగముకలిగించువారు కాశికా నగరములో వేయిలింగములను బ్రద్దలు కొట్టినప్పుడగు, వేయిమందిబ్రాహ్మణు లను నాలుగువేలగోవులను జంపినప్పుడు నెట్టిపాపమును బొందుదురో అట్టి పాపమునే పొందుదురనిగూడ శ్లోకములు రచింపబడినవి.  శ్రీధరేశ్వరనాయకుడు, నాగహస్తి, కరణదరియా యనువారలు సాక్షులుగను, ధేనుకాకాయస్థుడు లేఖకు డుగను బేర్కొనబడిరి.  కుమారతుంగరాజు, ధమదేవుడు, గోవర్ధనుడు, దనార్ధనుడు, గాగిరపాత్రుడు, సాధుసారంగుడు, వీరలచేత గలముముట్టబడియె ననియు, ఇద్ మానవృద్ధియొక్క స్వహస్తలిఖికి మనియు, ఇయ్యది జన సామాన్యాభిప్రాయమును వెల్లడించుచున్నదనియు నాశాసనమునందు వ్రాయ బడి యున్నది.
  ఇట్టి మధురాంతకదేవు డేకారణముచేతనో చక్రకొట్యమండలము నాక్రమించు కొని  పరిపాలనము సేయుచుండగా ధారావర్షునిపుత్రు డగు