పుట:Andhrula Charitramu Part 2.pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గలరు. శాసనపరిశోధకు లితనిశాసనములు బరిశీలించి యితడు రేనాటిచోడు లలోనివా డని సిద్దాంతీకతించిరి.1 ఇతడు మొదటికులోత్తుంగచోడచక్రవర్తితో నీదేశమునకు దండెత్తివచ్చి ధారావర్షుడు కులోత్తుంగఛోడ చక్రవర్తికి గప్పము చెల్లించి యెడంబడికచేసికొన్నతరువాత నిచ్జటనే నిలిచిపోయి ధారావర్షునికి సైన్యాధిపతిగను, సామంతుడుగ నుండె నని తోచుచున్నది. చంద్రాదిత్యుడు తన రాజదాని యగు వరశూరపట్టణమునందు (Modern Barsur) చంద్రాదిత్య సముద్ర మనుపేరిటా నొక ఘనతటాకమును నిర్మించెను. ధారావర్షనియొక్క యంగీకారమునుబొంది వడ్డనాడులోని యొకగ్రామమునుసయుతము నాశివాలయమునుకు దానముచేసెను. వడ్డనా డను నది విశాఖపట్టణ మండలములోని వడ్డారిప్రాంతప్రదేశమై యున్నది. జగదేక భూషణధారావర్ష మహారాజునకు గుండమహాదేవియందు సోమేశ్వరు డను కుమారుడు జనించెను.

          రాజభూషణ సోమేశ్వర మహారాజు.
   ధారావర్షునకు వెనుక చక్రకూటరాజ్యాధిపత్యమునకై వానికుమారుడగు సొమే

శ్వరునకును వాని దాయాది యగు మధురాంతక దేవునకును వివాదము పొసగి యుద్ధము జరిగినటుల శాసనములందు గానబడుచున్నది. ధారావర్షుడు చక్రకో ట్యమండలమును బరిపాలించుకాలముననే వానికి లోబడిన సామంతుడుగనో లేక స్వతంత్రుడుగనో మధురాంతకదేవు డనునాగరాజు భ్రమరికోట్యమండ లమును ను బరిపాలనము సేయుచున్నటుల మధురాంతకదేవుని రాజపుర శాసనము వలన దెలియుచున్నది.2 తదితర నాగవంశోద్బవులయిన చక్రకూట రాజులవలెనే మధురాంతక దేవుడను తాను నాగవంశొద్భవుడ ననియు, భోగవతీపురాధీశ్వరుడి ననియు, వ్యాఘ్రలాంచనము గల వాడ ననియు, వ్యాఘ్రలాంచనముగల వాడననియు, నాదధ్వజము గలవాడ ననియు, మహేశ్వరపాదారాదకుడు


1.ఆంధ్రులచరిత్రములోని ప్రధమభాగము పేజి 351.Annual Report on Epigraphy, 1909, para 65. 2.Ep. Ind. Vol. IX, PP. 174-181