పుట:Andhrula Charitramu Part 2.pdf/153

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


లును నెలకొల్పబడుచువచ్చినవి. సెలయేళ్ళ కానకట్టలు కట్టి తటాకముల నిర్మించి వానింబట్టి పంటకాల్వలు త్రవ్వించి వ్యవసాయదారులకు జలాధారములను గల్పించుచువచ్చిరి. వీరి కాలమునందు కృష్ణాపట్టణము గొప్ప రేవుపట్టణముగ నుండెను. ఈ రేవుగుండ విదేశములతోడ విస్తారముగా వర్తకవ్యాపారము జరుగుచుండెను. విదేశర్తకులెందరో ఈ దేశమునకు వచ్చి ఇచ్చట నివసించుచుండిరి. విదేశవర్తకులు సహితమిచ్చటి వర్తకులతో మ్రైతిబాటించి వీరు చేయు ధర్మకార్యములకు దామును తోడ్పడుచుండిరి. తక్కువజాతుల వారు నాగరికులై శైవులు, వైష్ణవులనగుచు నగ్రవర్ణముల వారితో సాటిరాగలవారమని చెప్పుకొనుట ప్రారంభమయ్యెను. ఈ విషయము మరియొక తావున విస్తరించి వ్రాయబడును.

మూడవ ప్రకరణము

నాగవంశోద్భవులైన మహారాజులు

క్రీ.శ.1030 మొదలుకొని క్రీ.శ.1325 వరకు

ఆంధ్రులచరిత్రములోని ప్రధమభాగమున నాగులగూర్చియు, నాగకులస్థులనుగూర్చియు గొంతవఱకుజర్చించి వారల యుదంతంబు బావుకులకు దెలిపి యున్నాడను. వీరలచరిత్రం దామూలాగ్రముగా దెలిసికొనగోరినయెడల సంస్కృతభాషలో వ్రాయబడిన పురాణేతిహాసకావ్యగ్రంధములు మొదలగువాటిని బెక్కింటిని బరిశోధించి యొక ప్రత్యేకగ్రంధమును వ్రాయవలయునెగాని యీయాంధ్రులచరిత్రమున సవిస్తరముగా దెలుప సాధ్యముకాదు. ఆర్యు లీజంబూద్వీపమునం బ్రవేశించినకాలమున నీదేశమునందును దీన్తిసమీపదేశములయందును సురాసురయక్షగంధర్వకిన్నరకింపురుషసిద్ధసాధ్యవిద్యాధరగరుడోరగాది జాతులవారు ఇవసించుచుండిరి. ఈ జాతులలోని వీరనాయకులనేకసహస్రవత్సరములు గడిచిపోవగా దివ్యపురుషు