పుట:Andhrula Charitramu Part 2.pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బహు శతాబ్దములకు ముందే యాంధ్రకవితాకన్య జనించి వర్ధిల్లుచుండగా వ్యాకరణాదిగ్రంథములు లేవని యొట్లు విశ్వసింపవచ్చును? ఆంధ్రభాషా చరిత్రమను ప్రత్యేక గ్రంథమున నీ విషయమును గూర్చి సవిస్తరముగాఁ జర్చింపదలంచి గ్రంథవిస్తర భీతిచే నిచ్చట జర్చింప మానుకొనుచున్నాను. ఈతని కవిత్వము తానె జెప్పుకొన్నట్లుగా దిక్కనసోమయాజి మెచ్చునంత రసవంతముగానే యున్నది. దశకుమారచరిత్రమునుండి యిందనేక పద్యములుదాహరింపబడియున్నవి గావున శైలి దెలుపుటకై తెనుగుకాదంబరినుండి యొక పద్యము మాత్రముదాహరించుచున్నాడను.

 సీ.“కడువేడి వెల్లెండ పుడమి పేల్చిన బొద్దు
లాకాశగతియ మే లనితలంప,
వాత్యాభిహతి లగ్గ వాడి వియచ్చరు
లవనిపై జనుట మే లని తలంప,
నడవడగా నీళు లుడికిన జలనరుల్
వనచరవృత్తి మే లని తలంప,
వనముల గార్చిచ్చు దనడిన వనచరు
లంబుసంచరణ మే లని తలంప
గీ. వాడి యెండ గాసె వడిగొనె సురగాడ్పు
లెసగె వడయగాలి నెగసివీచె
దావదహన మడలె జీవుల కధికసం
తాపకారి యగు నిదాఘవేళ.”

బయ్యనామాత్య కవి.

మరియు దిక్కనసోమయాజి కాలమున బోజరాజకీయము, రసాభరణము మొదలగు గ్రంథరాజములను రచించి విఖ్యాతి గాంచిన యనంతామాత్యుని ముత్తాత యగు బయ్యనామాత్యుడు కవిత్వము చెప్పి తిక్కనసోమయాజిచే ‘భవ్యభారతి’యని పొగడ్త గాంచినటుల ననంతామాత్యుడు తన భోజరాజీయములోనిదైన___