పుట:Andhrula Charitramu Part 2.pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ట్లల్లన క్రోలిక్రోలి మలయానిలు డందు బురాణపత్త్రముల్
డుల్లగజేసె సత్క్రియ బటుత్వము కాముడు విచ్చలింపగన్"

కవివాగ్భందన మనులక్షణగ్రంథము నొక దాని రచియించినటుల దిక్కనసోమయాజి యీ క్రింది పద్యములలో జెప్పుకొనియున్నాడు.

"క. తనరం కవివాగ్భందన
మనుఛందం బవనివెలయ హర్షముతో ది
క్కన సోమయాజి చెప్పెను
జనులెల్ల నుతింప బుధులు సమ్మతి గాగన్
"

తిక్కనసోమయాజి కృష్ణశతక మొకటి చెప్పెనని వేంకటరంగ కవి యీ పద్యము నుదాహరించుచున్నాడు.

"ఆరయస్ శంతనపుత్త్రుపై విదురుపై నశ్రూరుపై గుజ్జపై
నరుపై ద్రౌహదిపై గుచేలునిపయిన్ నందప్రజశ్రేణిపై
బరగం గల్గు భవత్కృపారసము నాపై గొంచరానిమ్ము నీ
చరణాబ్జంబులు నమ్మినాడ జగదీశా కృష్ణభక్తప్రియా.
"

ఇట్టి కృష్ణశతక మొకటియుండెనేని యది తిక్కనసోమయాజికృతమైనది గాదని నిశ్చయముగా జెప్పవచ్చును.

తిక్కనసోమయాజి మతము

ఇతడు నిర్వచనోత్తరరామాయణము రచించునప్పటికిని శివభక్తుడని యీ క్రింది నిర్వచనోత్తర రామాయణములోని పద్యమువలన దేటపడుచున్నది.

మ."అమలోదాత్తమనీష నే నుభయకావ్యప్రౌఢి బాటించు శి
ల్పమునం బారగుడం గళావిదుడ నాపస్తంబసూత్రుండ గౌ
తమగోత్రుండ మహేశ్వరాంఘ్రికమలధ్యానైకశీలుండ న
న్నమకుం గొమ్మనమంత్రికిన్ సుతుడ దిక్కాంకుండ సన్మాన్యుడన్
"

మఱియిను భారతము రచించునప్పటికి బరిపక్వ స్థితినిగాంచి అద్వైతముయొక్క నిజతత్త్వమును దెలిసికొని పరతత్త్వమునే గొల్చుచుండె నని శ్రీమదాంధ్రమహాభారతములోని విరాటపర్వమున మొదట జెప్పబడిన దేవతాస్తుతి,