పుట:Andhrula Charitramu Part 2.pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ముద్దవంటిది. ఆంధ్రభారత మాముద్దలోనుండి కావలయునంత బంగారమును దీసికొని స్వర్ణకారుని బుద్ధివైభవముతో జేయబడిన చక్కని సువర్ణ కమలము వంటిది. ఉభయ భారతములలోని యీ భేదముజూపి స్వర్ణకారుని బుద్ధివైభవము వెల్లడిచేయుటయే మా యుద్దేశము."

ఇట్లాధునిక విద్వాంసులు మాత్రముగాక ఇట్టి యభిప్రాయములు పూర్వ కవులుగూడ కలిగియున్నారు. కవిత్రయము వారిలో మూడవ వాడును ప్రబంధ పపరమేశ్వర పదప్రఖ్యాతుడు నైన యెఱ్ఱాప్రెగ్గడ తను రచియించిన హరివంశమునందు నన్నయభట్టును నీకవిచంద్రుని బ్రస్తుతించునప్పు డీక్రింది పద్యములను రచించి నన్నయభట్టారకునికంటె నీతడు మహిమోన్నతుడని సూచించెను.

"ఉ. ఉన్నతగోత్రోసంభవము నూర్జితసత్వము భద్రజాతి సం
పన్నము నుద్ధతాన్యపరిభావిమదోత్కటము న్నరేంద్ర పూ
జోన్నయయోచితంబు వయి యొప్పెడు నన్నయభట్టుకుంజరం
బెన్న నిరంకుశో క్తిగతి నెందును గ్రాలుట బ్రస్తుతించెదన్.
"

అను పద్యమును విద్వత్కవికుంజరుం డయిన నన్నయభట్టారకుని వినుతి చేసి,


"మ. తన కావించిన సృష్టి తక్కొరుల చేతంగాదు నానేముఖం
బున దా బల్కినపల్కు లాగమములై పొల్పొందు నా వాణి న
త్తునునీతం డొకరుండు నా జను మహత్త్వాం గని బ్రహ్మ నా
వినుతింతుం గవితిక్కయజ్వ నఖిలోర్వీదేవతాభ్యర్చితున్.
"

అని తిక్కన సోమయాజిని కవిబ్రహ్మయని చెప్పియున్నాడు.

ఈ కవివతింసుడు నిర్వచనోత్తర రామాయణమును, మహాభారతమును మాత్రమేగాక, విజయసేన మను మఱియొకసమాన ప్రౌఢకావ్యముని, కవివాగ్బంధన మనియెడు ఛందస్సును, కృష్ణశతకమును, రచించెనని చెప్పుదురు. విజయసేనము మిక్కిలి ప్రౌఢమైన యముద్రితగ్రంథము గావున శైలిదెలియుటకై దానినుండి కొన్ని పద్యములిందు బ్రకటించుచున్నాను.