పుట:Andhrula Charitramu Part 2.pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

95

విజ్ఞాన చంద్రికా గ్రంధమాలా సంపాదకు లగు శ్రీయుత వేంకట లక్ష్మ రావు పంతులు. ఎం. ఏ. గారిట్లు వ్రాసి యున్నారు.

తిక్కన కృత భారత సంస్కృత మహా భారతమునకు భాషాంతీకరణమని మనవారందఱనుకొనుచున్నారు; కాని, అది గొప్ప పొరబాటు. ఇట్లనుకొనుట మనము తిక్కన యెడ నొక యపరాధము సేయుటయే. సంస్కృతాంధ్ర మహ భారతముల నొద్ద బెట్తుకొని సాంతముగ జ్గివ్ చూచిన యెడల నాంధ్ర మహా భారతము సంస్కృత మహా భారతములో నుండి కధ మాత్రము గ్రహించి దాని కంటే వేయి రెట్లధిక మనోహరముగా రచించిన స్వతంత్ర మహాకావ్యమని చెప్ప తప్పదు. మూలములో లేని యుద్దాలంకారములును, రస భావములును, మానవ స్వస్భావ వర్ణనలును, దెలుగు మహాభారతమునం దెచ్చట జూచినను విచ్చల విడిగా గాన వచ్చును. మూలములోని విసుగు బుట్టించెడి యనేక ధీర్ఘ కథానకములును, వర్ణనలును, వేదాంత ఘటేటములును, తెలుగు నందు లేనే లేవు. తిక్కన నిజమైన కవి యగుటచే నిరంకుశ్యుడసి మూలము లోని ముఖ్య కథను మాత్రము తీసుకొని కడమ భాగము నిష్టము వచ్చి నటుల తగ్గించి పెంచి, మార్చి వ్రాసెను. ఇట్లు చేయక సంస్కృతము లోనున్న ' చ ' కు దెనుగున 'ను ' పడ్డదా, లేదా యని యిప్పటి కొందఱు కవుల వలె జూచుకొనుచు దిక్కన తెనించి యుండినచో నతని కావ్యము పృథివిలోని యుత్తమ కావ్వ్యములలో మెక్కటి యై యుండును. కావున తిక్కన కృత మహ భారతము స్వతంత్ర కావ్య మనియే చెప్ప వలలసి యున్నది. ఇట్లనుట వలన సంస్కృత మహాభారతము స్వతంత్ర కావ మనియే చెప్పవలసి యున్నది. ఇట్లనుటకు వలన సంస్కృత మహా భారతము నుండి తిక్క యేమియు కైకొని యుండ లేదని కాని, యది మిక్కిలి తక్కువ యోగ్యత కలదని గాని, చెప్పుట మాయుద్దేశము కాదు. సంస్కృత మహా భారతము మా కత్యంత పూజనీయమే. కావ్యముగను, ఇతి హాసముగను, దాని యోగ్యత గొప్పది మే మెఱుంగుదుము. కాని,. మూలములోని ప్రతి శబ్దమునకు దూచి నట్లు దెనుంగున నొక్కొక శబ్దముండిన గాని యది మంచి కావ్యముగా నేరదని యనేకాంధ్ర విద్వాంసుల యభిప్రాయ మైనందున నది యసత్యమని చూపుటయే మాయుద్దేశము. సంస్కృత భారతము బంగారపు