పుట:Andhrula Charitramu Part 2.pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

క. అభిమతుడు మనుమభూవిభు
సభ దెనుగున సంస్కృతమున జతురుండై తా
నుభయ కవిమిత్త్రనామము
త్రిభువనముల నెగడ మంత్రి తిక్కడు దాల్చెన్.

సీ. సరస కవీంద్రుల సత్ప్రబంధములొప్ప
గొనునను టధికకీర్తనకు దెరువు,
లలిత నానా కావ్యములు చెప్పునుభయ భా
షలయందు ననుట ప్రశంస త్రోవ,
యర్థిమై బెక్కూళ్ళ నగ్రహారంబులు
గా నిచ్చుననుట పొగడ్త పొలము,
మహిత దక్షిణ లైన బహువిధయాగంబు
లొనరించుననుట వర్ణనము దారి,

గీ. పరునికొక్కని కిన్నియు బ్రకటవృత్తి
నిజములై పెంపుసాంపారి నెగడునట్టి
కొమ్మనామాత్యు తిక్కన కొలది సచివు
లింక నొక్కరు డెన్నంగ నెందుగలడు?"

ఈ పై పద్యములంబట్టి తిక్కనసోమయాజి విబుధజనవర సంస్తుత్యంబైన పాండిత్యమునను, కవిత్వమునను, జతుర రాజనీతి కార్యనిర్వహణ దురంధరత్వమునను, గృతిపతిత్వ సామ్రాజ్య వైభవమునను, వైదిక మార్గ నిష్ఠా ప్రారంభమునను, లోక ప్రసిద్ధింగాంచి హరిహరనాథ భక్తి భావ నిర్మలచిత్తుండై యుత్తమంబైన గృహస్థ ధర్మంబును నిర్వహించుచుండెననుటయే ఈయన ప్రతిభా విశేషమును వేనోళ్ళ జాటగలదు. ఈ కవినిగూర్చి పై పద్యములలో జెప్పబడిన మాటలు నిక్కంబులు, అందతిశయోక్తి యేమియులేదని నొక్కి చెప్పగలను. తిక్కనకృతమైనను మహాభారత కావ్యభాగ మాంధ్రభాషలో నద్వితీయమైనదనుటకు లేశమాత్రము సందియములేదు. ఇంత చక్కని కావ్యము ప్రపంచములో మరి యే భాషయందైనను నుండునన్న విశ్వాసము