పుట:Andhrula Charitramu Part 2.pdf/129

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


విశేషంబులను గూర్చియు, వీర్యవితరణ మహిమాదులను గూర్చియు, మహత్తర కవిత్వ సంపత్తిని గూర్చియు, సారవిహీనంపు బలుకులతో రసాభాసమును గావించుచు నేనిచట వర్ణించి చదువరుల మనంబులకొకింత శ్రమంబు గలిగింపనిష్టము లేక, అభినవదండి నా వినుతిగాంచిన కేతనకవివర్యుండు మిగుల రసవత్తరంబుగా రచించి యమ్మహనీయునకే యంకితము గావించిన దశకుమార చరిత్రములోని పద్యములనే చదువరులకు గర్ణరసాయనముగా నీ క్రింద నుదాహరించుచున్నాడను.

"సీ. సుకవీంద్ర బృందరక్షకుడెవ్వడనిన వీ
డను నాలుకకు దొడవైనవాడు,
చిత్త నిత్య స్థిత శివుడెవ్వడనిన వీ
డను శబ్దమున కర్థమైనవాడు
దశదిశావిశ్రాంతయశు డెవ్వడనిన వీ
డని చెప్పుటకు బాత్రమైనవాడు
సకల విద్యా కళాచణుడెవ్వడనిన వీ
డని చూపుటకు గురియైనవాడు,

గీ.మనుమసిద్ధ మహీశ సమస్త రాజ్య
భారధౌరేయు డభిరూప భావభవుడు
కొట్టరువు కొమ్మనామాత్యు కూర్మిసుతుడు
దీనజనతా నిధానంబు తిక్కశౌరి.

క. అగు నన గొమ్మయ తిక్కడు
జగతి నపూర్వార్థ శబ్దచారుకవితమై
నెగడిన బాణోచ్ఛిష్టం
జగత్త్రయం బనిన పలుకు సఫలం బయ్యెన్.

క. కృతులు రచియింప సుకవుల
కృతులొప్ప గొనంగ నొరునికిం దీరునె వా
క్పతి నిభుడు వితరణశ్రీ
యుతుడన్న మసుతుడు తిక్క డొకనికి దక్కన్.