పుట:Andhrula Charitramu Part 2.pdf/128

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


మనుమసిద్ధి రాజు మరణమునొందిన వెనుక బహుకాలము వరకు జీవించియున్నట్టుగ గనంబడుచున్నది. తిక్కన సోమయాజి శిష్యుడైన మారనకవి 1295వ సంవత్సరము మొదలుకొని 1323వరకు బరిపాలనము చేసిన రెండవ ప్రతాపరుద్రుని సేనాధిపతులలో నొక్కడగు నాగయగన్న మంత్రికి దన కావ్యము నంకితము చేసియుండుటచేత తిక్కన సోమయాజి 1290వ సంవత్సరము వరకు జీవించియుండవచ్చును.

సరసకవితా సామ్రాజ్య విలసితుడైన యిమ్మహాకవివరుండు_

"ఉ. ఆదరణీయ సార వివిదార్థగతి స్ఫురణంబుగల్గి య
ష్టౌదశ పర్వ నిర్వహణ సంభృతమై పెనుపొందియుండునం
దాది దొడంగి మూడు కృతులాంధ్రకవిత్వ విశారదుండు వి
ద్యాదయితుండొనర్చె మహితాత్ముడు నన్నయభట్లు దక్షతన్."

అని నన్నయభట్టును ఆంధ్రకవిత్వ విశారదుండనియు, విద్దాయితుండనియు మాత్రమే చెప్పియున్నాడు గాని, ప్రథమాంధ్ర కవినిగా జెప్పియుండలేదు. అదియునుంగాక,తిక్కన యాదికవీంద్రులను నూతన సత్కవీశ్వరులను నిర్వచనోత్తరరామాయణమునందు స్తుతించుటచేత నన్నయాదులకు బూర్వమునందు గూడ నాంధ్ర కవీంద్రులనేకులున్నట్టు స్పష్టపడుచున్నది. [1]

కవిబ్రహ్మయనియు, కవిలోక చక్రవర్తియనియు, నాంధ్రకవి ప్రపంచముచే నిరంతరము సంకీర్తనము సేయంబడుచున్న ఇమ్మహానుభావుని గుణ

  1. నన్నయభట్టారకుడు బూర్వము అనేక శతాబ్దములనుండి యాంధ్రసారస్వతము వర్ధిల్లుచున్నటుల ననేక దృష్టాంతముల వలన దెలియుచున్నది. క్రీ.శ.6వ శతాబ్దమునుండి యాంధ్రకవిత్వము వర్ధిల్లుచున్నదనుటకు తెలుగు శాసనములలోని పద్యరచనయే సాక్ష్యముగనున్నది. రాజరాజనరేంద్రునకు సమకాలికుడగు భోజమహారాజునకు ముద్రామాత్య మనునొక యాంధ్రకావ్యము క్షేమేంద్రకవిచే నంకితము చేయబడినటుల దెలియుచున్నది. కవిభల్లటుడను కవి భేతాళపంచవింశతి యను తెలుగు ప్రబంధమును జాళుక్య విక్రమాదిత్యునకంకితము చేసెనని దెలియుచున్నది.