పుట:Andhrula Charitramu Part 2.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మహితయశుడైన తిక్కనమంత్రియింట,
మంత్రిమణియైన తిక్కనమంత్రి యింట."

ఆహా! ఇమ్మహానుభావుడు పరశురామునివలెను, ద్రోణాచార్యునివలెను, కృపాచార్యునివలెను, అశ్వత్థామవలెను, బ్రహ్మతేజము దాల్చుటమాత్రమే కాక, మహాక్షాత్ర్తమునుబూని వారలవలె గ్రూరచిత్తుడై దుష్కర్మములకొడిగట్టక మానియై ధర్మయుద్దంబున బ్రాణంబులర్పించుటకు నైన సిద్ధపడియెంగాని, అపయశంబు పాలబడుటకొల్లడయ్యెను గదా! అభినవదండియైన కేతనకవి పొగడ్తలు పొల్లులుగాక తిక్క సేనాని పట్టున సత్యంబులై సార్థకంబులగుచున్నవి. తిక్కనసేనాని, సిద్ధిరాజు సమ్మతిగైకొని తానొక్కడనే యాదవులను జయించివత్తునని తన సైన్యములతో ముందుగాబోయి, శత్రువులను మార్కొనియెను. అప్పుడుభయ సైన్యములకును ఘోరమైన యుద్ధము జరిగెను. తుదకు తిక్కనసైన్యమంతయు హతమయ్యెను. తిక్కన యుద్ధభూమిని నొక్కడు మిగిలియుండుటను ప్రతిపక్ష యోధుడైన పిన్నమానాయుడు చూచి -

"పోరునిలుపుమోయి భూసురోత్తముడ
సరిగాదు మాతోడ సమరంబుజేయ
అగ్రజుల్ మీరు యాదవులము మేము
ఆగ్రము మామీద నుంపంగరాదు."

అని పలికెనట. అందుపైని తిక్కన, సైన్యమంతయు హతమగుటకు జింతించి మరల సైన్యమును గొనివచ్చి తలపడియెదంగాక యని గుర్రమును ద్రిపఙకొని పురంబునకు వచ్చెనట. పౌరజనంబులు పరాజితుడై పారివచ్చిన తిక్కయోధునిగాంచి, నవ్వువారును, కేరడములాడువారును, నై యనేక విధముల మనస్సునకు జింతగలిగించిర. పౌరజనంబులుమాత్రమేగాక, ఇంటికిబోయిన తోడనే వృద్ధుడైన తండ్రి సహితం "యుద్ధమున నైన జావక ఇటులేల పారివచ్చితివి.కడుపచెఱుప బుట్టితిని" అని నిందించెనట. ఈ రణతిక్కన స్నానమునకు వచ్చినపుడు భార్య స్త్రీలకుంచినట్లుగా రహస్య స్థలంబున నీళ్ళ