పుట:Andhrula Charitramu Part 2.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

80

బడు గొల్లవాండ్రెల్లను తమతమ పసులమందలను దోలుకొని దక్షిణమునకు వచ్చి మనుమసిద్ధి రాజుయొక్క పసులబీళ్ళను గొన్నిటిని పుల్లరికి గైకొని పసులను మేపుకొని పుల్లరి జెల్లింపకయే వెడలిపోయిరి. అందుపై సిద్ధిరాజునకు గోపమువచ్చి అన్నంభట్టను బ్రాహ్మణుని రాయబారిగా గాటమరాజుకడకు బంపించెను. కాటమరాజు పుల్లరి చెల్లిపంక తగవు పెట్టెను. అంతట మనుమసిద్ధిరాజు కాటమరాజును శిక్షించుటకై బహుసైన్యములం గూర్చుకొని దండెత్తివచ్చెను. కాటమరాజుకూడ బంధుజనులను మిత్రులను గూర్చుకొని యుద్ధసన్నద్ధుడయ్యెను.

అప్పుడు తిరునామాలతిప్పరాజు, శ్రీకంకరాజు, పెదవేగి చొక్కరాజు, పెదవరద రాజు, ఆర్లుకొండ అచ్చిరాజు, ఆదివన్నె మాదిరాజు, గయికొండ గంగరాజు, ఉర్లకొండ సోమన్న, ఉదయాద్రి ఉమ్మయ్య, చెన్నపట్టణము చంద్రశేఖరుడు, దేవముని వెంగళయ్య, పట్టుకోట బసవరాజు, కాళహస్తి పాపతిమ్మరాజు, వెలకంచి వెంగళపతిరాజు, ప్రభగిరిపట్టణము పద్మశేఖరుడు మొదలగు యోధులు మనుమసిద్ధికి దోడ్పడవచ్చిరి. ఈ యోధుల కందరకు నాయకుడై ఖడ్గతిక్కన సిద్దిరాజు సేనల నడిపించుకొని వచ్చెను.

పల్నాటప్రభువయిన పద్మనాయడును, పల్లికొండప్రభువయిన చల్ల పిన్నమనాయడు, దొనకొండ అయితమరాజు, ఎఱ్ఱయ్య, భట్టావులరాజు, కరియావులరాజు, వల్లభన్న, నాచకూళ్ళనాయడు, నేతిముద్దయ్యనాయడు, పాచయ్యనాయడు, ముమ్మయ్యనాయడు, పుత్తమరాజు, మొదలగు యాదవవీరులును, కాటమరాజునకు దోడ్పడవచ్చిరి. ఈ సైన్యములకంతకు బిన్నమనాయనిమంత్రియు నారాధ్యబ్రాహ్మణుడు నగు బ్రహ్మరుద్రయ్యనాయకుడై నడిపించెనట. ఉభయసైన్యములును పాలేటియొడ్డున నున్న పంచలింగాలకొండకడ నెదుర్కొన్నవి.

సిద్ధిరాజు సేనాపతి ఖడ్గతిక్కన, తిక్కరాజుమంత్రియును తిక్కనసోమయాజి పెద్దతండ్రియునగు సిద్ధనామాత్యుని నేడ్వురు కొడుకులలోను బెద్దవాడని ఇదివరకే తెలిపియుంటిని. ఇతడే ప్రతిమానమైన ప్రతిభ కల