పుట:Andhrula Charitramu Part 2.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

“సమగ్రమును, సప్రమాణమునగు నాంధ్రదేశచరిత్రము వ్రాయుట మిక్కిలియగత్యము. అట్టి గ్రంథములు ప్రస్తుతము బొత్తిగా లేవు. కాని చరిత్ర వ్రాయుటకు గావలసిన సాధనములనేకములు గలవు. సర్వజ్ఞుడగు నీశ్వరుని సంకల్పమువలన మన పూర్వకవులు ప్రాయశఃనిర్ధనులై తమతమ కాలములందుండిన భూపతులను వారి మంత్రులు మొదలుగా గల ఇతర ధనవంతులను నాశ్రయించి వారిని తమ కృతులకుబతులుగా నొనర్చుటయు నట్లు చేయునప్పుడా కృతిపతులను వారి పూర్వులను స్తుతించుటయు సమకూరినవి. ఈ స్తవములలో నతిశయోక్తుల క్రింద గొంతభాగమును గొట్టివేసినను చరిత్రోపయోగములగు నంశములు గలవు. కృతులయందు బహుశః కాలనిర్ణయము లేదు. కాలనిర్ణయము కలిగి యితర విషయములలో గృతుల బోలియున్నవి తామ్రశిలాశాసనులు. మరియు నీ శాసనములు, తొలుత లిఖించబడినవె కాని వాటి ప్రతులు కాకయుండుటబట్టి పరమప్రమాణములుగా నంగీకరించపదగియున్నవి. ఇట్టి శాసనములు వేలకొలది గలవు. శాసనములు, కృతులు, పురాణములు మొదలగు సాధనములను సావధానముగా నిష్పక్షపాత బుద్ధితో బరిశీలించినయెడల దేశవృత్తాంతము చాలావరకు దేలును. తేలినప్పుడు ప్రస్తుతము పలువురనుకొనునట్లు మన దేశము పూర్వకాలమందంధకారబంధురమగు ప్రాకృతస్థితిలో నుండినది కాదనియు, నాయా