యూహింపవచ్చును. ఇట్లు నాగులను గూర్చిన లెక్కలేని గాథలు మన పురాణ గ్రంథములయందు వెదజల్లబడియున్నవి. ఒక్క పురాణాది పూర్వగ్రంథములయందు మాత్రమేగాక ఇటీవలి చారిత్రములయందును కావ్యాదులయందును గూడ నాగులయొక్కయు నాగరాజులయొక్కయు జరిత్రములభివర్ణింపబడియున్నవి.
చరిత్రాంశములు.
క్రీస్తు శకము నాలుగవ శతాబ్దమధ్యమున సముద్రగుప్తుడను గుప్తచక్రవర్తి దక్షిణ దిగ్విజయ యాత్రకు బయలుదేఱి గణపతి నాగడను నొక నాగరాజును జయించినట్లుగ జెప్పబడియెను. సింహళ ద్వీపమునందలి నాగులను బుద్ధుడేవిధముగా దన మతములోనికి జేర్చుకొనియెనో మవ్విధమునంతయు బౌద్ధచరిత్ర గ్రంథములగు మహావంశము, రత్నాకరి, రాజావళి మొదలగు గ్రంథములయందు వివరముగ వ్రాయబడియుండెను. సిద్ధార్థుడు బౌద్ధుడైన పిమ్మట నైదవయేట మహోదరుడు, చూలోదరుడను నాగులిరువురు వజ్ర సింహాసనమునకై పోరాడుచుండుటనుగాంచి నాగులయందలి ప్రేమచేత నాగద్వీపమునకు జూడబోయెను. అకాలమునందు పంచశత యోజనములు విస్తీర్ణము గలిగి చుట్టును సముద్రముచే జుట్టుకొనబడియున్న నాగద్వీపమును మహోదరుడను నాగరాజు పరిపాలమును సేయుచుండెను. వాని తోబుట్టువు కందమాదనమను కొండను నేలెడి నాగరాజునకీయబడి వివాహము చేయబడియెను. ఆ దంపతులకు జనించిన కుమారుడొకడు వజ్రసింహాసనము దనకు రావలయునని తగవు పెట్టెను. ఈ మహాత్ముడు వారలకు సంధిచేయుటకై ప్రయత్నించి మంచి హితోపదేశమును గావించెను. వారలా సింహాసనమును బుద్ధునికర్పించి వాని కూడిగము జేయబూనిరి. బుద్ధుడా సింహాసనమున గూరుచుండి ధర్మము నుపదేశించి యెనుబది కోట్ల నాగులను బౌద్ధమతావలంబకులనుగా జేసెను.
మహోదరుని మేనమామయును కళ్యాణిపురాధీశ్వరుడును నగు నాగరాజును గూడ తన మతములోనికి జేర్చుకొని కొంత కాలమునకు వారలను విడిచిపెట్టిపోవుచు వజ్రసింహాసనమా నాగరాజునకిచ్చి రాజాయతనవృక్ష