బొదుగుచుండెను. దానిని ప్రజలు చూచి చుట్టును మూగికొని "స్సు స్సు" యని చప్పట్లు చఱచి కేకలు వేయగా నాగరాజదృశ్యుడయ్యెను. అంతట వారలాతట్టను బరీక్షింపగా నొక పురుష శిశువుండెనట! ఆ కారణమున నాతడు శిశునాగుడని పేరుపెట్టబడెయనట! కొంతకాలమున కాతడు మగధ సింహాసనమధిష్ఠించెను! ఈ వంశమునందు గడపటి వారయిన తొమ్మండుగురు నందులతోగూడ చంద్రగుప్తుడు సింహాసనము బాలించిన రాజులెల్లరును నాగులే కాని యార్య క్షత్రియులు కారు. వీరందఱును సర్పములను బూజించెడి వారులుగాని యార్యమతస్థులు గారు. ఆ కారణముచేత బ్రాహ్మణులయిన యార్యులు వీరిపట్ల ప్రబల ద్వేషము గలిగియుండిరి. బౌద్ధమతస్థులు వీరిని ప్రేమింపకుండిరి. వీరుభయులచేతను గూడ గౌరవింపబడక నీచముగా జూడబడుచుండిరి.
మఱికొన్ని గాథలు.
సుగ్రీవుడు సీతను వెదకుటకై వానరులను బంపుచు భోగవతీపురమును వర్ణించెను. ఈ భోగవతీపురమును దక్షిణాపథమునందున్నది. అనగా దండకారణ్యములో తూర్పు భాగముననో పశ్చిమభాగముననో యుండియుండును. శ్రీకృష్ణుడు కాళీయుడను నాగరాజును మర్ధించి కాళిందీకన్యల వివాహమాడినట్లుగా విష్ణుపురాణాదుల వలన గవ్వముగను వాసుకుని త్రాడుగ జేసికొని క్షీరసాగరమును మధించినట్లుగా భాగవతాది పురాణములయందు జెప్పబడినది. దేవతలు దానవులను మోసముచేసి వాసుకియను నాగరాజుయొక్క సహాయముతో దేశమునో దుర్గమునో యొకదాని బడసి యుందురని
- ↑ Turnour's introduction to the Mahavanso, XXXViii, See also Bigandet, Life of Goudamn, p362 et. Seq.