Jump to content

పుట:Andhrula Charitramu Part-1.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తేజోవంతముగ గన్పట్టక మానదు. ప్రాథమికార్యులు సూర్యకులులును బరిశుద్ధులునై యుండిరి. వీరి తరువాత వేయేండ్లకు వచ్చినవారు చంద్రకులులు. వీరు సూర్యకులులవలె నంతగా బరిశుద్ధులుగారు. అన్యజాతిరక్త మీచంద్రకులుల నాడులయందు బ్రవహింపుచుండెను. ఈ రెండవతెగవారు పాంచాలముగుండపోయి గంగా యమునాదులకు నడుమనుండెడి హస్తినాపురమునందు వసించియుండిరి. వీరలే భారతవీరులనిపించుకొనిన యుధిష్ఠిరాదులుగా నుండిరి. వీరు క్రీస్తుశకమునకు బూర్వము పదమూడవ శతాబ్ద ప్రాంతమున హస్తినాపురము నందుండిరి. అచ్చటనున్న కాలమున వీరి కుటుంబము వృద్ధియై హస్తినాపురము చాలక మఱియొక పురము కావలసివచ్చెను.

ఖాండవవన దహనము.

ఇప్పుడు ఢిల్లీ నగరముండిన ప్రదేశ మాకాలమున ఖాండవవనముగానుండి నాగులచే నాక్రమింపబడియుండెను. వారలను జయించిన గాని వనము స్వాధీనముగాదు. అయ్యది స్వాధీనమైన వెనుకగాని యరణ్యమును ఛేదించి పురమును గట్టుట సాధ్యముగాదు. అప్పుడర్జునుడు కృష్ణుని సహాయముతో ఖాండవవనమును దహించి నాగులం దఱిమివేసెను. బౌద్ధుల దేవతయగు నింద్రుడు నాగులను సంరక్షించెను. ఆర్యుల వైదిక దేవుడగు నగ్ని వనమునంతయును దహించి నాగరాజయిన తక్షకుని దక్క తక్కిన నాగకులమును నిర్మూలము చేసెనని చెప్పబడియెను. ఈ ప్రదేశమునందే పాండవులు ఇంద్రప్రస్థమను పురమును నిర్మించిరి.

అర్జునుడు నాగకన్యల వివాహమాడుట.

ఈ ఖాండవవన దహనానంతరము నార్యులకును నాగులకును మైత్రికలిగి యున్నటులనే చెప్పబడియెను. అర్జునుడు సమయ భంగ కారణమున దీర్థయాత్రకు బయలువెడలినప్పుడు నాగకన్యయగు నులూపిని వివాహమాడినట్లుగ జెప్పబడియుండెను, మఱియు మణిపురాధీశ్వరుండును నాగరాజును