పుట:Andhrula Charitramu Part-1.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నగా బాము. నగములో నుండి పుట్టినది నాగము. ఈ నాగులనియెడి జాతి వారు నాగములను పూజించువారగుట చేతనో నాగమును ధ్వజమునందుంచెడు నాగధ్వజులగుట చేతనో, లేక నగములయందు సంచరించెడు జాతి వారగుట చేతనో, మరియేమి కారణముచేతనో యీజాతివారికి నాగులనియెడు పేరు వచ్చినది. మన పూర్వగ్రంధము లీనాగులకథలతో నిండియున్నవి. ఈ నాగుల యనార్యాచారములనే పెక్కింటినిప్పటికిని మనవా రవలంబించి యె యున్నారు. ఈనాగులు పాములను బూజించువారగుటచేతనే నేటికిని మన వారు పాములను బూచించుచున్నారు. ఈ నాగులు వృక్షములను బూజించు వారు కనుకనే మనవారు నేటికినీ వృక్షములను పూజించుచున్నారు. పూర్వకాలము నందీదేశము నాగులకు లోబడి నాగులచే పరిపాలించబడి నాగసంప్రదాయలనే యవలంబించి నాగుల అనార్యాచారములలో మునిగి యుండినదగుట చేతనే కాబోలు మనదేశమునం దెచ్చట విన్నను నాగశబ్ధమే వినంబడుచున్నది. మనదేశమునందు నాగూరు, నాగవరము, నాగపురము, నాగపట్టణము, నాగేశ్వరము, నాగులపాడు, నాగమూడి, నాగరము, మొదలగు గ్రామనామములు వినంబడుచున్నవి. ఇంతియగాక నాగి, నాగడు, నాగులు, నాగయ్య, నాగన్న, నాగప్ప, నాగిరెడ్డి, నాగినీడు, నాగరాజు, నాగవర్మ, నాగలింగము, నాగరత్నము, నాగోజీరావు, నాగేశ్వరరావు అను నామములు మనుష్యులలో వినబడుచున్నవి. మరియును మనదేశమునందు నాగములను బూజించుటకు కార్తిక శుద్ధ చవితి "నాగులచవితి" యను పేరుతో బర్వదినముగా నొప్పుచున్నది. ఈ పర్వదినము బ్రాహ్మణులకంటెను బ్రాహ్మణేతరులచే మిక్కిలి భక్తి పూర్వకముగా బూజింపబడుచున్నది. పూర్వకాలమునందలి అనార్యులీ నాగములగొల్చెడి నాగులను సాధారణముగా గౌరవముతో జూచెడివారుగారు. ఆకారణముచేతనే గాబోలు నెవ్వడైనను ఒకానొకప్పుడేదియైన నొక తెలివి తక్కువ పని చేసినప్పుడు గాని హానికరమైన పని చేసినప్పుడు గాని మనవారు "ఓరినాగులూ, ఓసి నాగమ్మ" యని నిందాగర్భముగం బలుకు చుండుటను నేడును మనము చూచుచున్నాము. మనదేశమునందు కార్తికకు