పుట:Andhrula Charitramu Part-1.pdf/91

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ఐదవ ప్రకరణము.

నాగులు-నాగకులులు.

ప్రాథమికా ర్యులు సింధునదిని దాటి వచ్చి యామహానదికి దూర్పుపక్కను సరస్వతీ దృషద్వతీ నదులకు మధ్యను స్థిరవాసములేర్పరచుకొనిన తరువాత వేయేండ్లకు బిమ్మట నార్యులలో మరియొక శాఖవారు. బయలుదేరి గంగాతీరముకు వచ్చి, కురుపాంచాల దేశములందు వసించియుండిన కాలమున, హిమాలయ పర్వతము మొదలుకొని వింధ్యపర్వతము వరకును గలదేశము నంతను నాగులనియెడి యొకజాతి వారు పరిపాలనము చేయుచుండినవారని మనకావ్యపురాణేతిహాస గ్రంధముల వలనను, బౌద్ధమతస్థుల గ్రంధములవలనను గానంబడుచున్నది గాని, మనదేశచరిత్రములను వ్రాసిన పాశ్చాత్యులేమి, హైందవ చరిత్రకారులేమి తామువ్రాసినగ్రంధములయందు నీ నాగుల చరిత్రమును విశదీకరింపక యేమి కారణముచేతనో విస్మరించియున్నవారు. నాచుచేగప్పబడిన శుద్ధజలమువలెనే వీరి చరిత్రమంతయు బురాణగాథలచే గప్పబడి చరిత్రకారుల నేత్రములగు గోచరముగాకయుండెను. ప్రాధమికార్యులు దస్యులతో బోరాడినట్లుగ ౠగ్వేదా దులయందు దరచుగా గానబడుచుండినను తరువాత వచ్చినయార్యులు లీనాగులతోడను నాగకులులతోడను బోరాడినట్లుగ మహాభారతాది గ్రంధములయందు గానంబడుచున్నది. ఆంధ్రులు దండకారణ్యమునం దాంధ్ర రాజ్యమును స్థాపించి పరిపాలనము చేసి వాసికెక్కుటకు బూర్వమీనాగులీ దండకారణ్యమునాక్రమించి కిరాతజాతులవలనన్నిటిని జయించి రాజ్యమును స్థాపించి పరిపాలనము చేసినట్లుగా గాన్పించుచున్నది. మన పురాణములయం దభివర్ణింపంబడిన నాగలోకమనునది యీ నాగులదేశమెగాని పాతాళముగాదు. మన పురాణ గాథలలో నభివర్ణింపబడిన నాగకన్య లీనాగజాతి కన్యలేగాని యన్యులుకారు. నగమనగా గొండ. నాగమ