Jump to content

పుట:Andhrula Charitramu Part-1.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దీనినే బ్రహ్మావర్తదేశమని దేవదేశమని పిలుచుచుండిరిని. మనుస్మృతియందు వా కొనబడినది. ఇచ్చటనే చాతుర్వర్ణ విభాగమును. యజ్ఞాది క్రతుకర్మలను ఆచరణలోనికి దేబడి పెంపొందినవి. ఇచ్చటినుండియే యార్యులు తూర్పునకును దక్షిణమునకుబోయి క్రమముగా హిమాలయముకును వింధ్యకు నడుంనుండెడి యావద్దేశము నాక్రమించుకొనిరి. దీనికే యార్యావర్తమని పేరు.

ఇట్లని మనుస్మృతి [1] వలనమాత్రమేగాక పతంజలికృత మహాభాష్యమువలనను వింధ్యోత్తరభాగం బార్యావర్తంబనియు, దేవదేశంబనియు, గౌడదేశంబుననియు, వ్యవహరింపబడియె నని తెలియుచున్నది. తద్దక్షిణభాగము మ్లేచ్చ దేశంబనియు, ద్రావిడదేశంబనియు, దక్షిణాపధమనియు వ్యవహరింపబడియెను.

దక్షిణాపథము.

నర్మదానదికి దిగువభాగము దక్షిణాపథమని పూర్వసంస్కృత గ్రంధ ములందు వ్రాయబడినది. దక్షిణశబ్ధములో నుండి దక్కినము పుట్టినది. అదియె హిందీభాషలో "డెక్కన్" అని చెప్పబడుచున్నది. అదియె "డెక్కన్" అని చెప్పబడుచున్నది. అదియెహిందీభాషలో "డెక్కన్" అని చెప్పబడుచున్నది. అదియె "డెక్కన్" అని యింగ్లీషున వాడంబడుచున్నది. డెక్కన్ అనుపదము దక్షిణశబ్ధము యొక్క వికృతరూపమని కొందరిచే భావించబడుచున్నది. డెక్కన్ దేశమున దక్షిణా పథదేశమె యని కొందరు చెప్పుచున్నారు. ఆర్యులుత్తరమునుండి దక్షిణమునకువచ్చిన మార్గమునుకు దక్షిణాపథదేశములని పేర్లు వచ్చినవి.

దక్షిణాపథదేశమునే ప్రాకృతభాషలో దభ్కిణాబదేశమని వ్యవహరించుచుండిరట![2] దక్షిణాపథమున చోళులయొక్కయు కేరళులయొక్కయు, దేశములుకలవని మార్కండేయ వాయుమత్స్య

  1. శ్లో. అనముద్రాత్తువైపూర్వా దానము ద్రాత్తుపశ్చిమాత్

    తయోరేవాంతరంగిర్యో ర్యార్యావర్తంవిదుర్బుధా అని మనుస్మృతి.

  2. Ind. Ant, Vol viii. p.143