వి. [1][2] ఈ ద్రావిడులు తమిళులు కూడా నార్యులకంటెను విలక్షణమయిన నాగరికతను గలిగియున్నట్లుగంపట్టుచున్నది. ఈ సంఘములవారే యిటీవల మనయాంధ్రదేశమున బ్రవేశించి యాంధ్రులలో గలిసిపోయినట్లుగా గన్పట్టెడివి.
ఆర్యులు-ఆర్యావర్తము.
అనేక సహస్రసంవత్సరములకు బూర్వమే యార్యులనెడి వారు హిమాచలమున కుత్తరభాగమున మిక్కిలి దూరమున మధ్యాసియా ఖండము నందు నివసించుచుండెడివారని బహుగ్రంధపరిశోధకులకు చరిత్రకారు లనేకు లభిప్రాయపడియున్నారు. అయినను ఉత్తరధృవమండలమే యార్యులజన్మస్థానమని ఋగ్వేదము నుండి కొన్ని ప్రమాణ వచనముల నెత్తి చూపి బాలగంగాధర తిలకుగారు "ఆర్కిటిక్ హోం " అనుగ్రంధమున విశేషముగా జర్చించి నిశ్చయించి యున్నారు. ఆర్యులు మొట్ట మొదట మధ్యాసియాఖండమునందుండినను, ఉత్తరధృవమండలమునందుండినను మరి యెచ్చట నుండినను క్రమముగా జనసంఖ్య పెరిగిన కొలది జన్మస్థానమున నివసించుటకుందావును ఉదరపోషణమున కాహారపదార్ధములను జాలక తమ జన్మస్థానమును విడిచిపెట్టి దక్షిణ దిగ్భాగమునకు గొందరును పశ్చిమదిగ్భాగమునకు గొందరును, వెడలిపోయిరి. వారిలో దక్షిణ దిగ్భాగమునకు వచ్చినయార్యులు హిందూదేశమునకు వాయవ్యదిశనున్న పర్వత మార్గములలో నుండి " సింధుతీరముకు వచ్చి యా మహానదిని దాటి దానికి దూర్పుననుండుదేశము నాక్రమించుకునిరి. ఈ ప్రదేశము సరస్వతీ దృషద్వతీ నదులకు నడుమనుండునది. ఈ భూమి మిక్కిలి పవిత్రమైనదిగా నెంచబడుచు వచ్చినది.