తునిసంతతిలో వీరిని జేర్చియుండ లేదు. మరియును పాండ్యచోళుల భ్రష్టతనొందిన క్షత్రియులని హరివంశము నుడువుతుంది.[1] మరికొన్ని పురాణముల యందు దక్షిణాపధముయొక్క కొట్టుకొన "అక్రీడు" డను రాజు తొల్లి పరిపాలించు చుండెననియు, అతనికి పాండ్య, కేరళ, కోల, చోళులను నల్వురు పుత్రులు కలరనియు వారిలో బెద్దవాడగు పాండ్యుడు స్వస్థానముననే రాజయ్యెననియు, తక్కినమువ్వురును, స్వదేశమును దాటి పైకి బోయి చోళ, కేరళ, కోలరాజ్యములను స్థాపించుకొని రనియును మరికొన్ని పురాణములు చెప్పుచున్నవి.
ఈ మూడు తెగలవారికి బిమ్మట కోనరులనియెడు మరియొక తెగవారు. వచ్చి కొంతకాలము వరకు బాండ్యులకు లోబడి తరువాత కొంగదేశమునకు (ఇప్పటి కోయంబత్తూరు జిల్లా) నధిపతులైరి.
తమిళులచే నివసింపబడుదేశము తమిళకమైనది.[2] ఈ తమిళకమున కుత్తరపు హద్దు వేంగడము వేంకటాచల (తిరపతి) మనబడుచున్నది. దక్షిణపుహద్దు కన్యాకుమార్యగ్రము. (Cape Comorin) తూర్పున బంగళా ఖాతమును పశ్చిమమున నరాబియాసముద్రమును గలవు ఈ హద్దులకు నడుమ నుండేడి దేశము తమిళకమని పేరు. తమిళులు దక్షిణా పధము యొక్క దక్షిణపుగొనకు రాకపూర్వము నాగులును ద్రావిడులును నివశించుచుండిరి. వీరికంటె సంఖ్యయందు గొరవడియుండుట చేత తమిళులు ప్రాచీన ద్రావిడభాష నవలంబింపవలసి వచ్చినది. వీరు ద్రావిడులలో గలిసిపోయి కొంతకాలమునకు నాప్రాచీన ద్రావిడ భాషను సంస్కరించిరి. వీరిభాష తమిళభాష. ఇదియే యింగ్లీషున "టమిల్" అనబడుచున్నది. వీరార్యులుగారు. ఆర్యులకు ప్రతిస్పర్ధులగ నుండుచువచ్చిరి. వీరిని మ్లేచ్చులని, సెఱవారని యార్యగ్రంధములు బేర్కొనియున్న