పుట:Andhrula Charitramu Part-1.pdf/80

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


పౌండ్రకులు, ఓండ్రులు, ద్రావిడులు, కాంభోజులు, యవనులు, శాకులు, పారదులు, పహ్లవులు, చీనులు, కిరాతులు, దరదులు, ఖకులు మొదలగు క్షత్రియులు పుణ్యకర్మలను విడిచి పెట్టి బ్రాహ్మణులను జూడనందున శూద్రులైనారని మనువు వ్రాసియుండెను. ఈ ద్రావిడులు క్రమముగా దక్షిణమునకు జేరి నాగరికులై జనసంఖ్య యెక్కువయిన కొలదినుత్తర భూముల నాక్రమించుకొనుచు దుదకు దండకారణ్యమునం బ్రవేశించి పల్లెల బట్టణముల నేర్పరుపసాగిరి. ఈ ద్రావిడులమూలముననే దండకారణ్యములో నివసించెడి యనాగరికజాతులన్నియు నాగరికతను గాంచి ద్రావిడులలో గలిసిపోయిరి. వీరి తరువాత దండకారణ్య దేశమునకు వచ్చినవారు మంగోలియా జాతుల వారుగా నున్నారు.

యక్షులు-తమిళులు-తమిళకము

ఆర్యులు దృషద్వతీ సరస్వతీ నదుల నడుమ బ్రవేశించి స్థిరనివాసము లేర్పరచుకున్న తరువాత, ఆసియాఖండ మధ్యమున నుండెడి పీఠభూమి యందు నివసించుచుండిన పసిమి వర్ణముగల జాతులవారు త్రివిష్టపము (Tibet) నేపాళము (Nepal) నడుమంగల పర్వత మార్గముల గుండ దక్షిణమునకు వచ్చి గంగానది ప్రాంతభూమిని నాక్రమించుకుని యుండిరి. ఈ పసిమి వర్ణముగల జాతులవారు సంస్కృత గ్రంధములయందు యక్షులుగా బరిగణింపబడి యభివర్ణింపబడి యున్నారు. పాలీభాషయందు యక్కోసనం బడిరి. చీనాదేశస్థులు వీరిని యూచీలనిరి. ఈ పసిమి రంగుగల జాతులవారు ప్రపంచమందలి యున్నత భూమియందు నివసించియుండిన వారగుట చేత లోకమందలి యున్నత భూమియందు నివసించి యుండిన వారగుట చేత లోకమునందలి జాతులలో నెల్ల దామే పూజ్యులమని యధికులమని భావించుకొనుచు "దైవపుత్రులమని" మని చెప్పుకొనుచుండెడి వారు. వీరు వివేకజ్ఞానసంపన్నులయిన నాగరికులగుట చేత గ్రమముగా బంగాళము (వంగము) నంతయు నాక్రమించుకొని తరువాత నక్కడ నుండి సముద్రముమీదుగా సింహళముకును దక్షిణహిందూదేశమునకును వచ్చి యుండిరి. రామాయణము రచింపబడునప్పటికి యక్షులు హిందూ