Jump to content

పుట:Andhrula Charitramu Part-1.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అవతారిక.

దేశచరిత్రము వలని ప్రయోజనము

దేశముయొక్క పురోభివృద్ధికిఁ బ్రబలశత్రువై, జనసామాన్యము నావహించియుండిన దురభిమాన పిశాచమునుబోఁ ద్రోలి ప్రజలను నీతివర్ధిష్ణువులనుగాను విజ్నానవంతులనుగాను జేసి భావికాల పరంపార్భివృద్ధిభవనమునకు మూలబంధమైయొప్పునది దేశచరిత్రమైనను దేశచరిత్రముయొక్క ప్రయోజన మెఱుంగని వారగుటచేత, మనపూర్వులు మనకొఱకు దేశచరిత్రమును వ్రాసి పెట్టియుండలేదు. దేశచరిత్రము లేక పోవుట మననాగరికతను మన భాషకును నొకగొప్పకొఱంతగా నున్నది. ఆంగ్లేయభాషావిశారదులై బహుదేశచరిత్రములను బఠించియు, దేశచరిత్రములయొక్క ప్రయోజనమెఱింగియు, మనయాంధ్ర దేశచరిత్రమునుగూడ వ్రాసి తమయాంధ్రసోదరుల కొసంగవలయునన్న తలంపింతవఱకు మనవారికి బుట్టియుండలేదు. సర్వకలాశాలా పరీక్షలం గృతార్థులయిన మనయాంధ్ర విద్యార్థులకు గ్రీసు, రోము, ఇంగ్లాండు, అమెరికా మొదలగు దేశముల చరిత్రము దెలిసినట్లుగా మన హిందూదేశచరిత్రము తెలియదు. అందును నాంధ్రదేశ చరిత్రము బొత్తిగ నెఱుంగరు. ఇది మనభావిపురోభివృద్ధికి గొప్పయాటంకము. సామాన్యజనులకు చరిత్రమున జ్ఞానమెలేదు. వారి గురువులు వారికేమి చెప్పిన నదియె వారికి చరిత్రమగుచున్నది. అందువలన ననేకా