బడుచుండిరనియు నార్యగ్రంధములందు గానంబడుచున్నది. ఈకథ మహాభారతములోని యశ్వమేధపర్వమున జెప్పబడియున్నది. [1] ఆదిమనివాసులయిన యనార్యులను రాక్షసులుగాను, ద్రావిడులను వానరులుగానుగూడ నార్యులు తమకావ్యములయందు వర్ణించినట్లుగ గన్పట్టుచున్నది. మనకాలమునందు అరవము, మళయాళము, కన్నడము, తెలుగు మొదలగు భాషలను మాటాలాడు వారిని ద్రావిడులుగా నెంచుచున్నారుగాని వీరు కేవలము ద్రావిడులని చెప్పుట యెంతమాత్రము సరికాదు. వీరిభాషలు ద్రావిడములో మిశ్రములయిపోయి వీరు ద్రావిడభాషావలంబనముజేసి యుండుటచేత భాషనుబట్టి వీరినందరిని ద్రావిడులుగా దలంచుచున్నారు. ద్రావిడులచేత నివసింపబడిన దేశమునకు ద్రావిడదేశమని పేరు వచ్చినది. వింధ్యకు దక్షిణమున గన్యాకుమారి వరకునుండు దేశము ద్రావిడదేశమని చెప్పంబడుచున్నది. ఆర్యులు ద్రావిడదేశమును మ్లేచ్చ దేశముగాను ద్రావిడులను మ్లేచ్చులుగాను భావించిరి. ఇందుకు బ్రమాణములు మహాభారతమునందును మన్వాది స్మృతి గ్రంధములయందును గానంబడుచున్నవి.[2]
- ↑
శ్లో. తతస్తు క్షత్రియాః కేటి జ్జామదగ్ని భయార్ద తాః
తేషాం స్వస్వహితం కర్మ తద్భయాన్నా నుతిష్ఠి తామ్
ప్రజా వృషలతాం ప్రాప్తాబ్రాహ్మణానామదర్శనాత్
ఏవం తే ద్రావిజాభీరాః పుండ్రాంశ్చ శబరైస్సహ
వృషలత్వం సరిగతా వ్యుత్థా నాక్షత్రధర్మిణః - ↑
శ్లో చాతుర్వర్ణ్యవ్యవస్థానం యస్మిన్ దేశే నవిద్యతే
తం మ్లోచ్ఛవిషయం ప్రాహు రార్యావర్తాదనంతరమ్. అని
భోదాయనస్మృతి మనుధర్మశాస్త్రము అధ్యాయము ౧౦ శ్లో ౪౩
"పౌండ్రాకాశ్చౌఢ్ర "ద్రవిడాః" కాంభోజాయపనాశ్చకాః
పారదాపహ్లవాశ్చీనాః కిరాతాదరదాఖశాః"
మనుధర్మశాస్త్రము, అధ్యాయము. ౧౦ శ్లో౪౪