పుట:Andhrula Charitramu Part-1.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లకు జరిగిన యుద్ధములను దేవదానవ యుద్ధములుగా మిక్కిలి చమత్కారముగా వర్ణించియుండిరి. ఆర్యులు దేవతలనియు సురలనియును, దస్యుల నసురులనియు దైత్యులనియు, దానవులనియు, రాక్షసులనియు పేర్లుపెట్టి వాడియుండిరి.

ద్రావిడులు, ద్రావిడదేశము .


ఆర్యులకంటెను బెక్కువేలేండ్లకు ముందే మధ్యాసియా ఖండము నుండి బయలుదేరి హిమాలయమును దాటి యీదేశమున బ్రవేశించి సింధునదీ ప్రాంతమున గొంతకాలముండి తరువాత గంగానది ప్రవహించెడి పల్లపు నేలదారిని తూర్పునకుబోయి యటనుండి వింధ్యపర్వతము ప్రాగ్భాగము వరకు వచ్చి అనంతరము తూర్పు కనుమలకు సముద్రమునకు నడుమనుండెడి సమభూమి మార్గమునందూర్పు తీరము వెంబడిని దక్షిణముగా గన్యాకుమారి వరకును బోయిరని కొందరిచే మార్గము నిశ్చయించబడినదిగాని యీదేశమునకు రాక పూర్వము ద్రావిడు లెందుండెడివారో ఏకాలమున ఏదేశమునకు వచ్చియుండిరో సహేతుకముగా నిర్ణయించి చెప్పుట కష్టసాధ్యమైన విషయముగాని యూహలపై నూహలునల్లి చెప్పుటకు సులభసాధ్యమైన సామాన్య విషయముగాదు. మనవారు ద్రావిడులనగా తరుమబడిన వారని యర్ధము చెప్పి యీదేశము మొట్ట మొదట స్వభావమునుబట్టి రోదులనబడెడి కోతులచే గాని వికల్పనకులని యౌత్తరాహులచే బిలువంబడెడి వానరులచేగాని [1] నిండియుండెడిదనియు ఈవికల్పనరులచే నాక్రాంతమై యుండిన కాలమున బరశురామునిచే నుత్తర దేశపు రాజులెల్లరు నిహతులై హతశేషు లయినవారురు. దక్షిణపుగొననున్న మలయాద్రిచాటునకు బారిపోయి వచ్చి యుండగా గ్రమక్రమముగా వారి బంధులును వారి పోష్యులు నగు నన్యవర్ణములవారును వచ్చి చేరి యుండుట చేత వీరందరు నౌత్తరాహులచే ద్రవిడులు లేక ద్రమిళులు ననునామంబున బిలువం

  1. నరసదృశా వానరాయని లేక వికల్పనరా వానరాయని వ్యుత్పత్తి (అనగా గొండవాండ్రు, కోదు వాండ్రు, మొదలగు ననాగరిక జాతులచే నిండి యుండినది )