దనుక దస్యులతో బోరాడి వారిని నరణ్యప్రదేశములకు దోలుచు క్రమముగా సింధూనదీప్రాంతప్రదేశమంతయు నాక్రమించుకొనిన తరువాత నుత్తర కురుదేశము , నుత్తర మాద్రదేశము, సప్తసింధుదేశము ననునవి యేర్పడినవి. ఋగ్వేదమును జదివినవారికి నార్యులయెక్కయు, దస్యులలయెక్కయు చరిత్రము సంపూర్ణముగా బోధపడగలదు.
లంకాద్వీపవాసులు.
దండకారణ్యమునందు భిల్లులు, గోండులు, శబరులు మొదలగు కిరాతజాతులవారు నివసించియుండగా దరువాత వచ్చి యాదేశము మొదటి నాక్రమించినవారు లంకాద్వీపవాసులయిన యనార్యులని రామాయణమును బట్టి గన్పట్టుచున్నది. లంకాద్వీపమును బాలించెడి రావణసంబంధు లయినవారు దండకారణ్యములో బ్రవేశించిరి. ఈ లంకాద్వీపవాసులచే నాక్రమించుకొనబడిన ప్రదేశముంతయు జనస్థానముగా పరిగణింపబడుచు వచ్చినది. అయోధ్యనుండి శ్రీరాముడు దక్షిణమునకు వచ్చి యీదండకారణ్యము బ్రవేశించినప్పుడు లంకాద్వీపవాసులయిన యనార్యులచే నాక్రమింపబడి యుండెను. రావణుని తమ్ముడగు ఖరుడనువాడు జనస్థానమును బరిపాలించుచుండెను. వీనికి దూషణుడు, త్రిశిణుడుననువారలు మంత్రులుగా నుండిరి. ఇచ్చటనే వీరి సోదరియగు శూర్ఫణఖ యనునామె రామలక్షణులను మోహించి సీత కుపద్రవము చేయబూనగా లక్ష్మణుడు దాని యొక్క ముక్కు చెవులను గోసివేసెను. అది తన సోదరుడగు ఖలునితో దనదురవస్థను జెప్పుకొనగా వాడు వీరలపై దండెత్తివచ్చెను. రామలక్ష్మణులిరువురు వారలతో యుద్ధము చేసి వారలను సంహరించిరి. తరువాత రావణుడు వచ్చి సీత నెత్తికొనిపోవుటయు మొదలగు వృత్తాంతమునంతయు రామాయణమునందు జదివి యున్నారము. ఈ రామాయణకథ సుప్రసిద్ధము. ఆబాలగోపాలము దీని నెరింగి యున్నవారు గాన నాకథ నిచ్చట దెలుప బనిలేదు. ఆర్యులు వీరిని రాక్షసులుగా వర్ణించియుండిరి. ఇట్లు రామాయణమునందు మాత్రమేగాక పురాణాదులయందును ఆర్యులకు ననార్యు