Jump to content

పుట:Andhrula Charitramu Part-1.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గారుమాత్ర మీఱాతిగుండ్లను ధాన్యకటకములోని బౌద్ధస్థూపమును నిర్మించకుముందు నభ్యాసమునకుగాశిల్పకారులు చేసియుందురుగాన వీరలు బౌధ్దుసంతతివారయియుందురుగాని పైవారు తలంచునట్లు ప్రాచీనులుగారనిరిగాని డాక్టరు కార్నీషుగారుమాత్రము వారివాదమునంగీకరింపక వారు బౌద్ధులకం _ , బూర్వీకులనియువాకొనియున్నారు.[1] ఇప్పటియొఱుకు, చెంచు, కోయ,యానాది మొదలగు తెగలవారియొక్క ప్రాథమికులయిన పితురులే యాదిమవాసులై(?) యుందురని మెకంజీదొరగారభిప్రాయపడియున్నారు. వీరిని __ మీ చెప్పిన సవరులు, రోదలు, గోండులు, శబరులు మొదలగు తెగలవారి __ జేర్పదగినవారని కార్మికేలుగారు వ్రాసియున్నారు. [2] ఇప్పటికి నాలుగు సంవత్సరములకు బూర్వమున నార్యులీదేశమునందలి సింధునదీతీరమునకు __నప్పటికి వీరికంటెను నాగరికులయిన జాతులవారు నివసించుచుండెడివా__న్పట్టుచున్నారు.

అనార్యులు-దన్యులు.

ఆ కాలమునం దనార్యజాతులవారెంత యనాగరికులుగాను మృగప్రా__గాను వర్ణింపబడినను వీర లచ్చటచ్చట గ్రామము లేర్పఱచుకొని పట్టణ __దుర్గములు నిర్మించుకొని రాజ్యములు స్థాపించుకొని సేనలనుగలిగి యార్యు __సమానముగా బోరాడినట్లు ఋగ్వేదాది గ్రంథములవలన స్పష్టముగా గ __చున్నది. అయినను ఆర్యాచారములకు విరుద్ధములయిన యాచారములను __టిని గలిగియుండుటచేత ననాగరికులుగ భావించి యార్యులు వీరపట్ల __మును వహించిరి. వీరికృష్ణవర్ణమును, వికృతరూపములును, మోటుతనము, రిక సహ్యముగా గన్పట్టి వీరినిదిరస్కార భావముతో జూచుచు అనార్యులు అని పిలువసాగిరి. ఇంతియగాదు; అనార్యులు తమత్రోవ కడ్డమువచ్చితమ్ము

  1. Mr G. Mekengie's District Manual of Kistna.
  2. Mr B.Corralkael's District Manual ofViza---tarn.