ఈ పుట ఆమోదించబడ్డది
గన్పట్టుచున్నది. ఇంతియగాక కేతనకవి తనదశకుమార చరిత్రమునందు "సీ. వేంగివిషయమున వెర్రిరాలనుపేర నభిరామమగునగ్రహారమునకు నగ్రణియగువాని నభినవదండినా బొలుపుమీరిన వాని ***** గేతనార్యుని నన్ను విఖ్యాతయశుని||" అనియును, ఎర్రాప్రెగ్గడకవియు దన నృశింహ పురాణమున :-
"సీ. ప్రజ్ఞాపవిత్రుడాపస్తంభమాంత్రుండు శ్రీవత్సగోత్రుడూర్జితచరిత్రు
- డగుబొల్లనకు బ్రోలమాంబకు బుత్రుండు వెలనాటిచోడునివలన మిగుల
- మన్ననగన్న భీమనమంత్రిపౌత్రుండు ప్రేకమాంబామన ప్రియుడు పోత
- మాంబికావిభుసూరనార్యుమజ్జనకుని బొల్లదీనిధికిని బ్రోలమకును
- జన్ననకు ననుజమ్మని గన్నతండ్రి వేగినాట గరాపర్తకవృత్తిమంతుం
- డనఘుడెరపోతనూరికంసారిచరణ కమలమధుకరపతిసారవిమలయశుడు"
అనియు నెల్లూరిమండలనివాసులగు వీరిరువురును దాము వేంగిదేశములోనివారమని చెప్పికొనుటచే వేంగిదేశము శ్రీశైలమునుకు దక్షిణభాగమె యనితోచుచున్నది. పదునారవుశతాబ్దమునందుండిన తెనాలిరామకృష్ణకవి తనపాండురంగమహత్మ్యమున :-
"సీ. నలుదెరంగులు గావ్యవసుధాధారలఘనుడ వాశువునందు గరముమేలే
- నఖిలభూమిపాలకాస్థానకమలాకరోచ్చయతరుణసూర్యోదయుడవు
- శైవవైష్ణవపురాణావళి నానార్థరచనాపటిష్ఠ్రైకరమ్యమతిని
- లౌకికవైదిక లక్షణచాతుర్యదైర్యప్రభారూఢకార్యచణుడ
- నాంధ్రభూమికుచాగ్రహారాభమైన
- శ్రీతెనాల్యగ్రహారనిర్నేతనగ్ర
- శాభికాకోకిలనమ నీవు సరసకవివి
- రమ్యగుణకృష్ణరామయరామకృష్ణ"
అని తానాంధ్రదేశములోనివాడ నని చెప్పికొని యుండుటంజేసి శ్రీశైలము మొదలు గోదావరిపర్యంతముగలదేశ మాంధ్రదేశము లేక తెలుగునాడ