Jump to content

పుట:Andhrula Charitramu Part-1.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కారణము లేకపోలేదు. క్రీస్తుశకము మూడవశతాబ్దము మొదలుకొని యేడవ శతాబ్దమువరకును పల్లవరాజులు, నటు పిమ్మట బండ్రెండవ శతాబ్దము వరకును పూర్వ చాళుక్యులును బరిపాలనము చేసిరి. వారి కాలమున దేశము వేంగి దేశమనియె విశేషముగా వాడబడుచువచ్చెను. రాజనరేంద్రుని యాస్థానకవియు పండితుడునగు నన్నపార్యుడు రాజమహేంద్రవరమును వేంగిదేశమునకు నాయకరత్నమని చెప్పియున్నాడు. పల్లవరాజులిప్పటి యేలూరునకు సమీపముననుండెడి వేంగీపురమును రాజధానిగా జేసుకొని యూదేశమును పరిపాలించిరి. ఏడవశతాబ్దాదిని రెండవ పులకేశివల్లభుడను చాళుక్యరాజు పల్లవరాజును జయించి తన తమ్ముని కుబ్జ విష్ణువర్థనుని వేంగీదేశమునకు బాలకునిగా నియమించెను. అమ్మరాజవిష్ణువర్థనుని కాలమున ననగా దొమ్మిదవశతాబ్దాదిని రాజధాని రాజమహేంద్రవరమునకు మార్పబడినది. పల్లవచాళుక్యులకాలమున నిదియంతయు వేంగీదేశముగా వ్యవహరింపబడినను మొదటి వేంగిదేశము చోళదేశప్రాంతమునందలిదియే యైయుండును.
"సీ. దక్షిణగంగనాఁదద్దయు నొప్పిన గోదావరియు జగదాదియైన

భీమేశ్వరంబును బెడఁగగుచున్న శ్రీపర్వతంబును జూచి యుర్విలోన
ననఘమై శిష్టాగ్రహారభూయిష్టమై ధరణీసురోత్సమాధ్వరవిధాన
పుణ్యసమృధ్ధమై పొలుచు వేఁగీదేశ విభవంబు జూచుచు విభుడు దక్షి
ణాంబురాశితీరంబున కరిగి దరితి| హారియైన కావేరీ మహాసముద్ర
సంగమంబునభూసరేశ్వరులకభిమతార్ధదానంబు చేపకృతార్థుడగచు ".


అని నన్నయభట్టు భారతాదిపర్వమున నర్జునుతీర్థయాత్రాసందర్భమున కళింగదేశమును, పురుషోత్తమ క్షేత్రమును, మహేంద్రపర్వతమును జెప్పినతరువాత నీపద్యములో గోదావరిని భీమేశ్వరమును, శ్రీశైలమును జూచిన తరువాత "అనఘమై శిష్టాగ్రహారభూయిష్టమై ధరణీసురోత్సమాధ్వరవిధాన పుణ్యసమృధ్ధమై పొలుచు వేంగీదేశ విభవంబు జూచుచు " నని వేంగిదేశము నెక్కువగా వర్ణించియుండుటచేత శ్రీశైలమునకు దిగువనుండుదేశమే మొదటి వేంగిదేశమని