పుట:Andhrula Charitramu Part-1.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నని బిరుదువహించినట్లుగ గాదకాపురలోని యొక తామ్రశాసనముననున్నది. [1]

పై నుదహరించిన ప్రమాణములను బట్టి త్రికళింగమను పేరు కొంతకాలము వ్యవహారము నందుండినదని స్పష్టముగ జప్పవచ్చును.

త్రిలింగ దేశము

త్రిలింగ సంజ్ఞ దేశమున ఎప్పటినుండి యేరీతి గలిగినదని పరిశీలింప బూనితిమా మనము నమ్మ నర్హముకాని పురాణ గాథలనే శరణ్యములుగా జేసి కోవలయును గాని విశ్వాసపాత్రములయిన చరిత్రాంశములేవియు మనకు గాన రావు. నిన్న మొన్న జరిగిన విషయములను బహుయుగములకు బూర్వమున బెట్టెడు పురాణము లీచరిత్రమున నిజము దెలిసికొనటు కెట్లు తోడ్పడగలవు. అయినను సాధ్యమగునంతవరకు నిజము దెలిసికొనుట బ్రయత్నించి చూతము. ఆంధ్రదేశమును పాలించెడి వేంగిరాజులు (పల్లవులును, చాళుక్యులును) త్రికళింగరాజునుగూడ జయించి పాలించుచుండిన వారగుటచేత నీ దేశముకూడా వ్యవహారమున ద్రికళింగమని వాడబడచు వచ్చెననుటకు సందియము పడవలసినపనిలేదు. ఈ త్రికళింగము జనసామాన్యముచే నుచ్ఛరింప బడునప్పుడు కొంతకాలము జరుగునప్పటికి క లోపింటచి త్రిలింగ పదమే వ్యవహారములోకి వచ్చియుండును. విదేశస్థులును త్రిలింగమనియే వ్యవహరించి యుందురు. త్రిలింగపదము వ్యవహారములోనికి వచ్చి యభ్యాసపడి దేశమున నాటుకున్న తరువాత త్రికళింగపదము జనులనుడులనుండి తొలగిపోయి శాసనములయందు మాత్రమే నిలిచియుండును. తరువాత నీ దేశమును బాలించిన వారిలో శైవమతస్థులయిన కడపటి పల్లవుల కాలముననో, కాకతీయులకాలముననో మొదటి చాళుక్యుల కాలముననో త్రిలింగదేశనామము మిక్కిలి ప్రాచీనమైనదైనట్లుగ జేయుటకు బ్రయత్నములు చేయబడియుండును. అయినను క్రీస్తుశకము రెండవశతాబ్దమునందుండిన టాలెమీయను నాతడు త్రిలింగమని పేర్కొని

  1. See P,11, C. F.Cunningham's Arch-Repts IX;J.A.S.B.VII I.485; As, Res IX108 Sir,Walter Elliot's Coins in Southern India.