మనగ్రంథములయందు మాత్రమేకాక క్రీస్తుశకమునకు బూర్వము రెండవశతాబ్దమున కళింగదేశమును జయించి యెరిస్సాలోని (ఉత్కలము) యుదయగిరి (ఖండగిరి) యందు ఖారవేలుడు వ్రాయించిన శాసనమునందును మూడు తావులకళింగము పేర్కొనబడినది. ఇదియునుంగాక విదేశీయులైన "ప్లీనీ, టాలెమీ" అను చరిత్రకారులిరువురును ఉత్తరకళింగమును, మధ్యకళింగమును, మూడవ కళింగమును (త్రికలింగమును) బేర్కొనియుండుట చేత మేగాస్తనీసు కాలమున సహితము మీ మూడు కళింగములన్నట్లు గన్పట్టుచున్నది.[1] అయిన అశోకుని శాసనములయం దొక్క కళింగమే పేర్కొనబడినది.
గంగానది మొదలుకొని కటకపురి వరకును గల దేశము త్తరకళింగ మనంబడుచున్నది. ఉత్తర కళింగమే యుత్కలమనబడుచున్నది. కటకపురి మొదలుకొని మహేంద్రగిరి పర్యంతముగలదేశము మధ్య కళింగము. ఇదియే కన్యోధదేశమనబడుచున్నది. మహేంద్రగిరి మొదలుకొని గోదావరివరకును గలదేశము కళింగము లేక త్రికళింగ మనబడుచున్నది. ఆంధ్ర రాజ్యము ప్రభ యడంగిపోయిన తరువాత నీ త్రికళింగ దేశు వేంగిరాజులచే జయింపబడి వేంగికి కూడా వ్యాపించియుండును. ఈ దేశమునకు ద్రికళింగ సంజ్ఞ యున్నటుల గ్రంథ నిదర్శనములు గానరావని కొందరు తలచుచున్నారు.[2] ఈ దేశము త్రికళింగమని వ్యవహరింప బడుదు వచ్చినదనుటకు గ్రంథస్థములగు నిదర్శనములు లేకపోలేదు. క్రీస్తుశకము 650 దవ సంవత్సరములోని యుద్ధమల్లుని శాసనములందొకదానిలో "వేంగీభువః పతిరభూ త్త్రికళింగకొట్టేః" అని త్రికళింగము వాడబడియున్నది. ఇంతియగాక క్రీస్తుశకము పండ్రెండవ శతాబ్దమున చేది దేశపురాజును కాళచూరి వంశజుడునగు శ్రీమ ద్విజయసింహదేవుని వంశములోని వాడగు శ్రీకర్ణదేవుడు త్రికళింగదేశమును జయించి త్రికళింగాధిపుడ