పుట:Andhrula Charitramu Part-1.pdf/63

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


వాడై మూరురాయగండ డని ప్రఖ్యాత బిరుదుగాంచిన మహావిక్రమశాలియగు కృష్ణదేవరాయలు తమ యాముక్తమాల్యదయందు "కళింగదేశ విజిగీషా మనీషందండెత్తిపోయి " అని వ్రాసుకొనియున్నాడు. ఆశతాబ్ధములోని వాడేయైన తెనాలి రామక్రిష్ణకవి తనపాండురంగమహత్యమున అతండు "కళింగ దేశాభరణంబగు పీఠికాపురం బధిష్టించి" అని వ్రాసియున్నాడు. ఏదియెట్లున్నను నాంధ్రదేశములోని సముద్రతీరప్రదేశము కొంతభాగము కళింగదేశముగా వ్యవహరింపబడుచు వచ్చెననుట నిర్వివాదాంశమనుటకు సందియము లేదు.

త్రికళింగదేశము.

ఇకను త్రికళింగ దేశమని వ్యవహరింపబడినాదా లేదా యని దెలిసికొనవలసి యున్నది. అందుకు నిదర్శనములు గాన రావని కొందరిచే దలపబడుచున్నది. [1]

మహాభారతమున మూడుతావులను కళింగ దేశము వర్ణింపబడినది. మార్కండేయపురాణములో నుత్తరదేశములందును, మధ్యదేశమునందును, దక్షిణదేశమునందును, మూడుతావులను కళింగదేశమున్నట్లు వర్ణించబడినది. [2]

 1. ఆంధ్రాక్షరతత్వము, పొరట 43
 2. " శ్లో. మత్యాశ్యకూటాః కుల్యాశ్చ్య కుంతలాః కాశ కోసలాః
  అధర్వశ్చ కళింగాశ్చ మశకాశ్చస్పకైస్సహ
   మద్యదేశ్యా జనపదాః ప్రాయకోమిప్రకీప్తాః


  శ్లో. గాంన్ధారాయననాశ్చైని సిస్తుసౌవీరమద్రకాః
  శతద్రుజాః కలింగాశ్చ పరదాహారభూషికాః


  చలి కాహుహుకాశ్చైవ ఊర్ణదార్ణాస్తధైనచః
  ఏతేదేశాహ్యుదీచ్యాశ్చ ప్రాచ్యాన్ దేసాన్ నిబోధమే.


  అధాపరేజనపదా దక్షిణాపధఃవాసినః
  మహారాష్ట్రామహిషికాః కళింగాశ్చైవసర్వశః