పుట:Andhrula Charitramu Part-1.pdf/62

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


మె తరువాత కళింగ త్రికళింగ[1] త్రిలింగ వేంగీ నామములచే వ్యవహరింపబడుచు వచ్చినను ఆంధ్ర త్రిలింగ నామములు మాత్రము నిలిచినవి.

కళింగదేశము.

గంజాము మండలములోని మహేంద్రగిరి మొదలుకొని గోదావరి వరకును గల దేశమునకు గళింగమను పేరుగలదు. చంద్రవంశపు రాజులు కళింగుడనువాడీ దేశమును బాలించుట చేత నప్పటి నుండి ఈ దేశము కళింగదేశమని వ్యవహరించ బడుచున్నది. ఇది పూర్వము మిక్కిలి ప్రఖ్యాతి గాంచినట్టి దేశము. బుద్ధుని కాలమందు దీనికి దంతపురము రాజధానిగనుండెను. దీనినే అంగుల్య నదిమీదనుండు సింహపురము పూర్వమొకప్పుడు రాజధానిగ నుండినది. బౌద్ధులచరిత్ర గ్రంధమగు మహావంశమునందు జెప్పబడినది. శ్రీకాకుళమొకప్పుడును కళింగపట్టణ మొకప్పుడును పూర్వము రాజధానులుగ నుండుచువచ్చెను. క్రీస్తుశకము మూడు నాలుగవ శతాబ్ధములయందు పిష్టపురము రాజధానిగనుండెను. దీనినే ఇప్పుడు పిఠాపురమనుచున్నారు. ఇది చాళుక్యుల కాలమునందు బీఠికాపురమను పేరం బరిగినది. తరువాత కురంగేశ్వర పురమనియెడి కోరంగి యేడవశతాబ్ధమునందు గళింగదేశములో బ్రఖ్యాతి కెక్కిన పట్టణముగా నుండెను.

ఒకప్పుడీ కళింగముత్తరమున గంగాతీరము వరకును మరొకప్పుడు దక్షిణమున కాంచీపురము వరకును వ్యాపించినది. వేంగీదేశమును పాలించిన పల్లవులు చాళుక్యులు నీకళింగదేశమును జయించి తమరాజ్యములో గలుపుకునుట చేత నాంధ్రకళింగములు రెండును మిశ్రములగుచు వచ్చి యేకదేశమైనవి. అయినను మహేంద్రవరము వరకును గలదేశమును పదునారవశతాబ్ధము దనుక గృష్ణాతీరప్రాంత ప్రదేశముల వారిచే గళింగదేశమనియె వ్యవహరింపబడుచు వచ్చినది. పదునారవ శతాబ్దములోని

1. తృతీయ కళింగమని యర్థము కాని యైరోపీయ పండితులు తలచి నట్లు మూడు కళింగములు కాదు.

  1. తృతీయ కళింగమని యదార్ధము కాని యైరోపీయ పండితులు తలచి నట్లు మూడు కళింగములు కాదు.