పుట:Andhrula Charitramu Part-1.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యది విశ్వసనీయముగాదు. పైనుదహరింపబడిన యైతరీయ రచనమునుబట్టి యాంధ్రులను నవనాగరీకారణ్యకజాతివా రొకరుకలరని తేటపడినది ఆయానాగరికాంధ్రులు నివసించుదేశమే యాంధ్రదేశ మనంబడుచున్నది. నాగరీకులు వసింప శక్యముకాని యంధకార బంధురమైన మహారణ్య ప్రదేశము నందు నివసించెడువా రగుటచేతనే యార్యులు వీరిదేశము నాంధ్రదేశమనియు వీరిని నాంధ్రులనియు నాడుదువచ్చిరి. అనాగరికులయిన యాంధ్రులు నివసించు దేశమున మిద్దెలు, మేడలు, నెట్లుగాననగును? అనాగరికదేశమునందు బుణ్యతీర్ధములెట్లుగాననగును? అర్జునుడు ప్రశంసింపక పోయినంతమాత్రముచేత నప్పటియనాగరికాంధ్రదేశము లేదనుకోవచ్చునా? మహాభారతము సభాపర్వమునందును, రామాయణము కిష్కింధకాండములోను నాంధ్రులు దక్షిణాపథముననున్న వారని తెల్పబడియుండలేదా ? [1] కాబట్టి రామాయణ మహాభారతములనాటికి దక్షిణాపథమున నాంధ్రులు లేరని ఆంధ్రదేశము లేదని చెప్పుటసొహసము. ఆంధ్రులున్నారని యొప్పుకొనుచు నాంధ్రదేశము లేదనుట మహాసాహసము. ఆంధ్రదేశము లేదనరాదుగాని అప్పటి కప్రసిద్ధమై అనార్యమై అరణ్యప్రదేశమున నున్నదని యొప్పుకొనక తప్పదు.

ఈ భాగమునందు దాంధ్రదేశము లేకుండుటచేతనే కాళిదాసు తన రఘువంశమునందు కళింగదేశమును పాండ్యదేశమును వర్ణించి నడుమనున్న యాంధ్రదేశమును వర్ణింపకుండెనని చెప్పుదురు కాని కొంచె మించుమించుగ గాళిదాసుని కాలమునందే యుండిన వరాహామిహిరాచార్యులు తన బృహత్సంహిత కూర్మ విభాగమునందు నాంధ్రదేశమును బ్రశంసించియే యున్నాడు.[2] అశోకుని

  1. "శ్లో. పౌండ్రాంశ్చద్రవిడాంశ్చైవ సహితాంశ్చాడ్రకేరళై ఆంధ్రా స్తాలవనాంశ్ఛైవ కళింగా నుష్ట్రకర్ణికాన్ " మహాభారతము, సభాపర్వము.
  2. ఆగ్నేయాందిశి వర్ణితః తతథా, ఆగ్నేయాందిని-కౌశలకళింగ వంగో పనంగ జఠరాంకాః కాణిక విదర్భవత్సాంధ్రచేదికాశ్చోస్వితండాశ్ఛ అని బృహత్సంహితాకూర్మ విభాగము, వాచస్పత్యము.