Jump to content

పుట:Andhrula Charitramu Part-1.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మూడవ ప్రకరణము

ఆంధ్రదేశ ప్రశంస.

ఇప్పుడు మన మేభూభాగము నాంధ్రదేశమని పిలుచు చున్నారమో యాభూభాగము పూర్వము దండకారణ్యములోనివని చెప్పబడినంతమాత్రమున నాకాలమున నాంధ్రదేశముగాని యాంధ్రులుగాని యిచ్చటలేరని యూహింపరాదు. ఆంధ్రులు ప్రాచీనులేగాని నవీనులుగారు. దేశములలో మిక్కిలి ప్రాచీనమైనదగు ఋగ్వేదమందలి తైత్తరీయ బ్రాహ్మణమునందు నాంధ్రుల ప్రశంసగలదు. ఆం దాంధ్రుల నాగరికారణ్యక జాతులలో జేర్పబడియుండరని యీ క్రిందివాక్యము వలన బోధపడగలదు."శ్రు. తస్యవావిశ్వామిత్రస్యేక శతంపుత్రాఅనుః - పంచాశదేవజ్యాయాం సో మధువందనః పంపాశత్కనీ మాన్తస్తద్యేజ్యాయాంపోనతే కుతలం మేనిరే. తానను వ్యాజాహారాంతాస్వః ప్రజాభక్షిష్టేతి తనీతేంద్రాః పుండ్రాః శబరాః పులిందామూతిబా ఖత్యుదంత్యా బహవోబహతి" [1] విశ్వామిత్రఋషి తనపుత్రులలో నేలచుండ్రయొక్క సంతతిని ఆర్యాశ్రమములయొక్క సరిహద్దులలో నివసించునట్లుగా శపించననియు వారలే ఆంధ్రులనియు, పుండ్రులనియు, శబరులనియు, పులిందులనియు, మూతిబాలనియు, పిలువబడుచున్నారనియు, విశ్వామిత్రుని సంతతివారలే దస్యులలో నధికభాగముగా నేర్పడిరని తెలుపబడినది. వీరెల్లరును దక్షిణమున, నివసించుచుండిన వారని చెప్పబడుచున్నారు. పులిందులును శబరులును, వింధ్యపర్వతప్రాంత భూములయందు నివసించియుండినారని నవీనగ్రంధముల వలన దెలియుచున్నది. వింధ్యపర్వతారణ్యములలో శబరులున్నారని బాణకవి తన కాదంబరి యందు వ్రాసియున్నాడు.

  1. ఐతరేయ బ్రాహ్మణము; సంచిక 2 అధ్యాయము 3, కండిక 1-