పుట:Andhrula Charitramu Part-1.pdf/51

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


జిల్లాలోని చాలాభాగమును, చెన్నరాజధానిలోని జయపురసంస్థానాంతర్గతమై గోదావరికి నుత్తరమునున్న కొంతభాగమును, గోదావరికి దక్షిణముగానున్న నైజాము రాజ్యములోని చాలభాగమును ఈ జనస్థానమును లోనివిగా గానవచ్చుచున్నవి. రావణుని తమ్ముడగు ఖరుడీజనస్థానమున కధిపతిగా నుండెను. వీని రాజధాని ఖరాలయము. రాయపూరు జిల్లాలోని "ఖరియా" లనునదియే ఖరాలయమని చెప్పబడుచున్నది. సంబలవూరనునదియె వాల్మికిచే వర్ణించబడిన శంబరపురమని చెప్పబడుచున్నది. పంచవటీ ప్రదేశముగూడా జనస్థానాంతర్గతమైనదిగ గానంబడియెడు పర్ణశాలనుండి రావణుడు సీతనెత్తుకు పోయిన కథ సర్వజనవిదితమైనదే గోదావరికి నుత్తరమున బంచవటీ ప్రదేశమునందును జనస్థానమునందును సీతను వెదికి వెదికి వెదికి గోదావరియొడ్డున కొంతదూరమరిగి పర్ణశాలకు దూర్పున భద్రాచలముకడ రామలక్ష్మణులు రామలక్ష్మణులు గోదావరి నదిని దాటిరి. అటనుండి దక్షిణముగా జనస్థానమున గొంతదూరము ప్రయాణము చేసిన తరువాత జటాయువు గలుసికొనియెను. అచ్చటనుండి పశ్చిమదిశను నైఋతిదిశను నడిచి జనస్థానారణ్యముదాటిన తరువాత సూటిగ దక్షిణదిశకు బోయిరి.[1][2][3] జనస్థానా నంతరమున మూడుక్రోశులమీద గ్రుంచారణ్యముదగిలెను. ఇది నైజాము రాజ్యమునకు నైరుతముననుండెను. ఈ యరణ్యము విడుచుటకు బూర్వము

మూడుక్రోశములు తూర్పుదిక్కునకు బోయిన ఇచ్చటనే వీరికి గబంధుడడ్డుపడెను. వాడు చెప్పినందున వారిరువురు పశ్చిమదిశకు బంపరు బోయిరి. పంచవటినుండి పంపానది వరకు వాల్మీకి రామాయణములో నిచ్చిన యీదిశలను బట్టి చూచినను నవి భద్రాచలమునకు సమీపమునందలి పర్ణశాలకుననుకూలముగా నున్నవే కాని నాసిక పట్టణము పంచవటియని గాని జనస్థానమని కాని యనుకొనుటకు ననుకూలముగా లేవు. ఋష్యమూకమును, మాల్యవంతమును, కిష్కింధము మొదలైన ప్రదేశములన్నియు హంపీ విరూపాక్షము సమీపమందలి పర్వతాదులని యందరి యభిప్రా

  1. ( 62-4-56)
  2. ( 69-1-2)
  3. ( 64