పుట:Andhrula Charitramu Part-1.pdf/5

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

సంపాదకీయభూమిక.

భరతఖండము యొక్క విశ్వాసార్హమైనట్టియు, సవిస్తరమైనట్టియు, చరిత్ర ప్రకటింపవలయునని విజ్ఞానచంద్రికామండలి వారు దీక్షవహించియున్నారను సంగతి యందరికిని తెలిసిన విషయమే, కాని భరతఖండ చరిత్రము సంగ్రహముగ హిందూదేశ కథాసంగ్రహ మను గ్రంథమూలమునఁ బ్రకటించినంతమాత్రమున సంతుష్ఠిఁజెందక, ఈ భరతఖండమందలి యొక్కొక్కదేశ చరిత్రమును విపులముగా వ్రాయించి ప్రకటింపవలయునని మండలి వారు యత్నించుచున్నవారు. ఆంధ్రదేశ చరిత్రము, కళింగదేశ చరిత్రము, బంగాళాదేశ చరిత్రము, గుజరాతుదేశ చరిత్రము మహారాష్ట్రదేశ చరిత్రము మొదలైన ఈ ఖండాతర్గతములైన యన్నిదేశముల చరిత్రము తెలుగువారికిఁ దెలియుట యావశ్యకము. అందు ఆంధ్రులకు ఆంధ్రదేశచరిత్ర మత్యంతావశ్యకము గదా.

* * *

ఈ యాంధ్రదేశచరిత్రమాహాత్మ్యమును గుఱించి గ్రంథకర్తగారే పీఠికయందు వివరముగ వ్రాసియున్నారు. కావున నేనధికము వ్రాయ నవసరములేదు. కాని యొక్క విషయమును గుఱించి యిచ్చటఁ గొంచెము వ్రాయవలసియున్నది. ఆంధ్రులు మిక్కిలి పురాతన కాలమున వైభవము లనుభవించిరి. అయినఁ జరిత్రజ్ఞానములేనివారు కొందఱు మొదటనుండియు నాంధ్రులు వైభవ శూన్యులేయని భ్రమపడి, మహారాష్ట్రులతోఁ దమకు