పుట:Andhrula Charitramu Part-1.pdf/46

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


సదృశమై యాంధ్రనగరి యను వేంగీపురమునకు నాత్యాసన్నమై యున్నదనుటకు సందియము లేదు. 25 మైళ్ళ పొడవును 10 మైళ్ళ వెడల్పును గలిగి యున్నది. కాబట్టి ఇప్పటి ఆంధ్రదేశము దండకారణ్యములో నొకభాగముగా నుండెనని తేటపడుచున్నది.

పంచవటి.

అయినను ఆంధ్రదేశమును దండకారణ్యము నుండి తొలగించి దక్షిణా పథమన మహారాష్ట్ర దేశమనియు ఇప్పటి మహారాష్టము మునుపటి దండకారణ్యముగా నుండెననియు, అగస్త్యాశ్రమమునకు యోజన దూరము గోదావరితీరమున నుండిన పంచవటి యందు శ్రీరాముడు కొంతకాలము నివసించె ననియు, హిందూమత కర్మకాండ ప్రకారము నేమతికార్య మాచరించినను తమదేశము పేరు చెప్పుకొనుట నాచారముగావున సంకల్పము చెప్పునప్పుడు మహారాష్ట్ర దేశస్థులు మహారాష్ట్రదేశము పేరు చెప్పుకొనక దండకారణ్య దేశే" యని దండకారణ్యము పేరు మాత్రమే చెప్పుచున్నారనియు గోదావరితీరమునందలి నాసిక పట్టణము పంచవటి అని చెప్పుకొనబడుచున్నదనియు గోదావరి ప్రవహించెడి సహ్యాద్రియొక్క యుత్తర భాగమైన గోవర్ధనము పురాణములందభి వర్ణింపబడినదనియు భరద్వాజుడు తన భార్యను సంతోషపెట్టుటకై గోవర్ధమున నొక ఆరామము నిర్మించెననియు గోవర్ధనము పురాణములయందు పట్టణముగాను పర్వతముగాను గూడ చెప్పబడుట చేతను గోవర్ధనమను గ్రామమొకటి నాశికపట్టణ సమీపమున నుండుటచేతను నాసికపట్టణమే పంచవటియని పురాణములు సమర్ధించుచున్నవిగా గ్రహింప వలసినదనియు డాక్టరు బండార్కరు గారు తమదక్షిణాపథ దేశ పూర్వచరిత్రమునందు జర్చించి యున్నారు.[1] మహారాష్ట్రము దండకారణ్య దేశము నుండి యాంధ్రదేశము దొలగించుటకును పంచవటి యన నాసికపట్టణమే యని

  1. Dr Bhandakar's Early History of Deekhan. sec 1-2-3.