పుట:Andhrula Charitramu Part-1.pdf/45

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


బడి యున్నది.[1] ఉత్తరరామాయణమునందు దండకారణ్యములోని పేర్కొనబడిన ఈ సరసెక్కడనున్నదని విచారింపగా నయ్యది యాంధ్రదేశము లోనిదిగా జూపట్టుచున్నది. ఏమన గొప్పదైదండకారణ్య మధ్యగతమై కొంగలకాకరమై యుండు తియ్యనీటికొలను మన యాంధ్రదేశములోనిదే కాని మైరియెచ్చటను గానరాదు. మరియు దండియు మహాకవి తన దశకుమార చరిత్రములో నీ యాంధ్రదేశము నభివర్ణింపుచు నిందిక మహాసరస్సుగలదనియు నది సారసనిలయమనియు నది యాంధ్రనగరికి[2] ననతి దూరముగానున్నదనియు బేర్కొని యుండుట చేత నట్లభివర్ణింప బడిన కొలను కొల్లేరుకాక మరియొక్కటి కానేరదు.[3]

"కొల్లేటి కొంగ"లను లోకోక్తియె కొల్లేటి కొంగలకు ప్రసిద్ధమను విషయమును వేనోళ్ళ జాటుచున్న దక్షిణ హిందూ స్థానమున నెన్నందగినపెద్ద తియ్య నీటి కొలను కొల్లేరు మాత్రమే యై దండి చెప్పినట్లుగా సలిల రాశి

  1. "నాం త్రేతాయుగే రామ బభుాన బహువిస్తరం | సమంతా ధ్యోజన శతం మృగపక్షి విసర్జతం | తస్మి న్నిర్మానుషేరణ్యే కుర్వాణ సప్త ఉత్తమం అహ మాక్రమితం సౌమ్య మధారణ్య ముపాగమం | తస్యరూప మరణ్యన్య నిర్ధేషుం మైన శత్నుమః| తస్యారణ్యన్య త మధ్యేతు సరోయోజన మాయతం | హంసకారండవాకీర్ణం చక్రవాకో సశోభితం | సమీపేతస్య సరసో మహా దద్భుత మాశ్రమం | పురాణం పుణ్య మత్యుర్ధంతసర్వజన వర్జితమ్ | "
  2. " అయాసిషందిసైః రైశ్చిదంధ్రనగరం | తస్యనాత్యానన్నే సలిలరాశిసదృశ్యస్య కలహంస గణదళసంసాతిగళిత కింజల్క శకలశారస్య సారసశ్రేణి శేఖరన్య సరసస్తీరకాననే కృతనికేతనస్థ్సి తః|"
  3. ఆంధ్రనగరియనునది యోరుగల్లు పట్టణమనియు, అందభివర్ణింపబడిన సరస్సామీపమున నెచ్చటనో యున్నదనియు కొందరు చెప్పుచున్నారు.