కొని యున్నను అధికభాగము నిర్జనారణ్యముగానె యుండెడిదని యూహింపవచ్చును.
దండకారణ్యగాధ.
ఈయరణ్యప్రదేశమునకే దండకారణ్యమని పేరుగలిగినది. పూర్వము వింధ్యాద్రి మొదలుకొని యంతటను నూరు యోజనములు ప్రమాణముగాఁ గలదేశమునంతను గిరాతులచేఁ జుట్టుకొనఁబడి యున్న దానిని దండుఁడనురాజు పరిపాలనము సేయుచునుండి యొకనాడు వేటకుంజని యరణ్యసంచారము సలుపుచు తన కులగురుఁడగు శుక్రుని కూతు సరజ యనుదానిఁ గాంచి మోహవివశుడై యామెను జెఱఁబట్టి యామె ఇచ్చకు వ్యతిరేకముగా బలాత్కరించెను. దానినంతయును శుక్రుఁడు కుమార్తె వలనం దెలిసికొని యాగ్రహించివాని దేశమున నేడు దినములు మట్టివాన గురియు నని శపించెను. ఆ శాపకారణమున నీ ప్రదేశమంతయు నిర్మానుష్యమగు దండకారణ్యమైనదనియు యుత్తర రామాయణమునఁ జెప్పఁబడినది. మఱియు నీ దేశము కిరాతజాతులచే నివసింపబడుచుండియఁ బూర్వకాలమునుంచే భార్గవానామక బాడబగోత్రజాతి (అగ్నిపర్వతముల) ముఖంబుననుండి వెడలఁ గ్రక్కంబడిన బురద వానచే నిర్మూలము చేయబడినదనిగూడఁ జెప్పఁబడినది. పూర్వమెప్పుడో యొకానొకప్పుడీ దేశ మగ్నిపర్వతముల చేత నాశము చేయఁబడినదని పై గాథ వలన మనకు సులభముగా బోధపడుచున్నది.
కొల్లేరు సరస్సు.
ఈ దండకారణ్య మధ్యమమున యోజనాయుతమైన (100 చతురపు మైళ్ళు వైశాల్యము) మహాసరస్సొకటి కలదనియు, అది జలవిహంగమములతో నత్యంత రమణీయమై యొప్పుచున్నదనియు దానియొడ్డున ఒక యాశ్రమము కలదుకాని యందెవరు లేరనియు, సమీపమునఁ బడియున్న శవము దినుట కేజంతువు లేదనియు, ఆ ప్రదేశమంత నిర్జంతుకముగా నున్నదనియు, నగస్త్యుఁడు శ్రీరామచంద్రునితోఁ జెప్పినట్లుగనుత్తర రామాయణమునఁ జెప్పఁ